iDreamPost
android-app
ios-app

నితిన్ క్రేజీ రీమేక్ ఎప్పుడు వస్తోంది

  • Published Aug 01, 2021 | 7:40 AM Updated Updated Aug 01, 2021 | 7:40 AM
  • Published Aug 01, 2021 | 7:40 AMUpdated Aug 01, 2021 | 7:40 AM
నితిన్ క్రేజీ రీమేక్ ఎప్పుడు వస్తోంది

ఈ ఏడాది రెండు థియేట్రికల్ రిలీజులు దక్కించుకున్న ఇమేజ్ ఉన్న హీరోల్లో నితిన్ ఒక్కడే మంచి స్పీడ్ లో ఉన్నాడు. దురదృష్టవశాత్తు చెక్, రంగ్ దే రెండూ ఫలితాల పరంగా నిరాశ పరచడంతో ఇప్పుడు తన ఆశలనే మాస్ట్రో మీదే ఉన్నాయి. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ అందాదున్ రీమేక్ గా రూపొందిన ఈ క్రైమ్ థ్రిల్లర్ లో నితిన్ మొదటిసారి కళ్లులేని వాడిగా నటించాడు. నభా నటేష్ హీరోయిన్ కాగా హిందీలో టబు పోషించిన నెగటివ్ షేడ్స్ క్యారెక్టర్ ని ఇక్కడ మిల్కీ బ్యూటీ తమన్నా చేసింది. నానితో కృష్ణార్జున యుద్ధం డిజాస్టర్ తర్వాత దర్శకుడు మేర్లపాక గాంధీ ఆశలన్నీ దీని మీదే ఉన్నాయి. కానీ ఫ్యాన్స్ కి అర్థం కానిది ఒకటుంది.

మాస్ట్రో షూటింగ్ పూర్తయి నెల రోజులు పైగానే అయ్యింది. ఇప్పటిదాకా టీజర్ కూడా రాలేదు. డిస్నీ హాట్ స్టార్ కి డైరెక్ట్ ఓటిటి కోసం ఇచ్చారన్న వార్త వచ్చింది కానీ ఇటు నిర్మాణ సంస్థ నుంచి కానీ అటు సదరు డిజిటల్ యాప్ నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. పోనీ మనసు మార్చుకుని థియేటర్ కు వస్తారా అంటే ఆబ్బె ఆ ఛాన్స్ లేదంటున్నాయి అంతర్గత వర్గాలు. నిజానికి స్వతంత్ర దినోత్సవ సందర్భంగా ఆగస్ట్ 15న మాస్ట్రో స్ట్రీమింగ్ ఉంటుందని ఆ మధ్య ఒక లీక్ వచ్చింది. ఇది నిజమనుకుంటే ఇప్పటికే పబ్లిసిటీ వేగం పెంచాల్సి ఉంది. కానీ అలాంటిదేమీ జరగలేదు. మరి వాయిదా వేశారా అనేది కూడా తెలియదు.

థియేటర్లు తెరిచాక కూడా ఇలా పేరున్న సినిమాలు ఓటిటి వెళ్లడం పట్ల ఎలాంటి విమర్శలు వస్తాయో నారప్ప విషయంలో అందరూ చూశారు. కానీ ఈ డీల్స్ అన్నీ లాక్ డౌన్ టైంలో జరిగినవి. ప్రాక్టికల్ గా ఆలోచిస్తే ఇప్పుడు సినిమా హాళ్లు తెరిచాక కూడా జనం ఆశించిన స్థాయిలో రావడం లేదు. ఒకవేళ ఇమేజ్ ఉన్న హీరోలవి వచ్చినా కూడా ఇప్పుడు ఓటిటిలు ఇస్తున్నంత మొత్తం షేర్ రూపంలో వసూలు కావడం ఇంకో నెల రోజుల దాకా జరగని పని. అయినా ఓటిటి అనౌన్స్ మెంట్లు అన్నీ కూడా కేవలం వారం ముందు మాత్రమే వస్తున్నాయి. ఆ లెక్కన చూసుకుంటే మాస్ట్రో స్ట్రోక్ ఏ రోజైనా బయటికి రావొచ్చు

Also Read: వెంకటేష్ సైలెన్స్ అందుకేనేమో

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet GirişgrandpashabetJOJOBET GİRİŞLERİCasibomCasibomBetcio