iDreamPost
android-app
ios-app

జాతిరత్నాలు 2 ఎప్పుడొస్తుంది?

  • Published Jul 11, 2022 | 5:12 PM Updated Updated Jul 11, 2022 | 5:12 PM
  • Published Jul 11, 2022 | 5:12 PMUpdated Jul 11, 2022 | 5:12 PM
జాతిరత్నాలు 2 ఎప్పుడొస్తుంది?

గత ఏడాది పెద్దగా అంచనాలు లేకుండా కేవలం 12 కోట్ల బిజినెస్ తో 35 కోట్ల దాకా వసూలు చేసిన సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ జాతిరత్నాలు సీక్వెల్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తూనే ఉన్నారు. సింపుల్ కామెడీతో మాస్ క్లాస్ అనే తేడా లేకుండా అందరినీ నవ్వించిన ఈ హిలేరియస్ ఎంటర్ టైనర్ ద్వారానే దర్శకుడు అనుదీప్ ఏకంగా కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ తో సినిమా చేసే ఛాన్స్ కొట్టేశాడు.

జాతిరత్నాలు 2 అమెరికా బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని, ముగ్గురు హీరోలు అక్కడికి వెళ్ళాక జరిగే కామెడీని నెక్స్ట్ లెవెల్ లో చూపిస్తారని అప్పట్లో ఏవో లీకులు వచ్చాయి. కానీ అనుదీప్ వాటిని కొట్టి పారేస్తున్నాడు. ఇప్పట్లో అది జరిగే పని కాదని, ఒకవేళ అనుకున్నా కూడా నవీన్ పోలిశెట్టిని ఒప్పించడం కష్టమని అంటున్నాడు. అంతే కాదు నిర్మాత నాగ అశ్విన్ ఓ పట్టాన ఓకే చెప్పే టైపు కాదని చెబుతున్నాడు

కంటెంట్ విషయంలో రాజీ పడని మనస్తత్వాలు కాబట్టి ఒకవేళ నిజంగా సెకండ్ పార్ట్ తీయాలనుకున్నా కనీసం మూడు నాలుగేళ్లు పట్టొచ్చని అతని వెర్షన్. ఈ లెక్కన ఇది రావడం డౌటే. అనుదీప్ తీస్తున్న ప్రిన్స్ సెప్టెంబర్ లేదా ఆక్టోబర్ రిలీజ్ కు ప్లాన్ చేసుకుంటోంది. ఆ తర్వాత విక్టరీ వెంకటేష్ తో ఓ హాస్య భరిత చిత్రం ప్లాన్ చేస్తున్నారని ఇన్ సైడ్ టాక్. సో జాతిరత్నాలు అభిమానులకు నిరాశ తప్పదు

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişantikbet girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom