iDreamPost
android-app
ios-app

Unstoppable with NBK: Prabhas ప్రభాస్ ప్రభావం మాములుగా లేదు

  • Published Dec 12, 2022 | 3:16 PM Updated Updated Dec 12, 2022 | 3:16 PM
  • Published Dec 12, 2022 | 3:16 PMUpdated Dec 12, 2022 | 3:16 PM
Unstoppable with NBK: Prabhas  ప్రభాస్ ప్రభావం మాములుగా లేదు

బాలయ్య నడిపిస్తున్న అన్ స్టాపబుల్ టాక్ షోకు సంబంధించిన కొత్త ఎపిసోడ్ ని ప్రభాస్ తో షూట్ చేయడం దాని తాలూకు ఫోటోలు సోషల్ మీడియాలో రావడంతో ఒక్కసారిగా ఆహా యాప్ కు రీచ్ పెరిగిపోయింది. మాములుగా సిగ్గరి మొహమాటం ఎక్కువగా చూపించే డార్లింగ్ బాలకృష్ణ అడిగిన ప్రశ్నలకు ఎలాంటి సమాధానం చెప్పి ఉంటాడోననే ఆసక్తి అభిమానుల్లో విపరీతంగా పెరుగుతోంది. కేవలం ఇంటర్వ్యూలో పాల్గొనడమే కాదు తన మార్క్ ఫుడ్డుని స్పెషల్ గా చేయించి యూనిట్ మొత్తానికి సరిపడేలా క్యారేజీలు తీసుకెళ్ళాడట. ఇంకేముంది ఇంత ఆతిథ్యం ఇస్తే ఎవరైనా సంతోషంతో ఉక్కిరిబిక్కిరి కాకుండా ఉంటారా. మొత్తం సందడి సందడిగా జరిగిందట

ప్రభాస్ ఒక్కడే కాదు. ఇందులో డబుల్ బొనాంజా ఉంది. తన ప్రాణ స్నేహితుడు గోపి చంద్ కూడా ఈ షోలో పాల్గొన్నాడు. ఇద్దరూ హీరో విలన్ గా నటించిన వర్షం ఎంత పెద్ద బ్లాక్ బస్టరో తెలిసిందే. వీళ్ళ ఫ్రెండ్ షిప్ గురించి తెలియని ఎన్నో సంగతులు ఈ షో ద్వారా బయటికి వస్తాయని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. యువి క్రియేషన్స్ తో బాండింగ్, కొత్త సినిమాల అప్డేట్స్ ఇవ్వడంలో వాళ్ళు చూపించే అలసత్వం మీద సెటైర్లు కూడా పడ్డాయట. ఇవన్నీ కిక్ ఇచ్చేవే. క్రిస్మస్ కి రిలీజ్ చేస్తారా లేక న్యూ ఇయర్ కానుకగా ఇస్తారా అనేది వేచి చూడాలి. రాధే శ్యామ్ డిజాస్టర్ తర్వాత ప్రభాస్ పెద్దగా బయట కనిపించలేదు. అందుకే దీనికి భారీ ఆదరణ ఉంటుంది.

పెళ్లి గురించి ప్రస్తావన వచ్చిందట కానీ దాని గురించి ఏం సమాధానం చెప్పి ఉంటాడో షోలో చూడాలి. ఇటీవలే కాలం చేసిన కృష్ణంరాజుతో బాలకృష్ణకు సుల్తాన్ లో కలిసి నటించిన అనుభవం ఉంది. వాటి తాలూకు సంగతులు కూడా వస్తాయి. ప్రభాస్ ప్రస్తుతం సలార్ షూటింగ్ మీదే ఫోకస్ పెట్టాడు. మధ్యలో మారుతీ సినిమాకు కొన్ని డేట్లు కేటాయించి రెండూ బ్యాలన్స్ అయ్యేలా ప్లాన్ చేసుకున్నాడు. ప్రాజెక్ట్ కెకు ప్రస్తుతానికి చిన్న విరామం ఇచ్చారు. ఆది పురుష్ కోసం తను చేయాల్సింది ప్రస్తుతానికి ఏమీ లేదు. ఒకవేళ జూన్ విడుదల కన్ఫర్మ్ అయితే ప్రమోషన్ల కోసం ఓ నెల రోజులు కేటాయించాల్సి ఉంటుంది. సో డైరీ చాలా టైట్ గా ఉండనుంది

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş