కేంద్ర కీలక నిర్ణయం.. ఇక నుంచి అన్నీ ఏసీ లారీలు, ఏసీ ట్రక్కులు!

కేంద్ర కీలక నిర్ణయం.. ఇక నుంచి అన్నీ ఏసీ లారీలు, ఏసీ ట్రక్కులు!

ప్రతి ఏడాది ఎండలు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. ఈ వేడి తీవ్రత ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఉష్ణోగత్ర 50 డిగ్రీలకు చేరిందంటే ఎండల తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో వాహనాల డ్రైవర్లు కూడా వేడి తీవ్రతకు చాలా ఇబ్బంది పడుతున్నారు.  దీంతో ట్రక్ తయారీ కంపెనీలు డ్రైవర్ల కోసం క్యాబిన్లు ఏసీ రూపొందించే ఆలోచనలు చేస్తున్నాయి. ఇదే సమంయలో కేంద్ర రోడ్డు రవాణా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి అన్ని ట్రక్కుల్లో డ్రైవర్ క్యాబిన్లలో  తప్పనిసరిగా ఎయిర్  కండిషన్ అందుబాటులో ఉండాలని ఆదేశించింది.

ట్రక్కు, లారీ డ్రైవర్లు నిత్యం  ఎక్కువ సమయం పాటు వాహనాలను నడుపుతుంటారు. కఠినమైన పని పరిస్థితుల్లో కూడా రహదారిపై ఎక్కువ గంటలు డ్రైవర్‌ అలసటతో ప్రమాదాలు జరుగుతున్నాయి. అంతేకాక పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు, ఇంజిన్‌ హీట్‌ అవ్వడంతో డ్రైవర్లు కఠిన పరీక్ష ఎదుర్కొంటుంటారు. ముఖ్యంగా వేసవిలో లారీలను, ట్రక్కులను డ్రైవింగ్‌ చేయడానికి ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యపై ఏళ్లుగా చర్చలు జరుగుతున్నా కంపెనీలు ఇన్నాళ్లు పెద్దగా పట్టించుకోలేదు. కానీ మారుతున్న వాతావరణ పరిస్థితులకు కారణంగా వాహనాల్లో కూడా మార్పులు చేయాలని భావిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో కేంద్ర  రోడ్డు, రవాణా శాఖ మంత్రి  నితిన్ గడ్కారీ కీలక నిర్ణయం తీసుకున్నారు.

ప్రస్తుతం రోడ్లపై తిరుగుతున్న ట్రక్కులోనూ ఏసీ క్యాబిన్లు ఏర్పాటు చేయాలని నితిన్  గడ్కరీ ఆదేశించారు. లారీ డ్రైవర్లు కష్టజీవులని మంత్రి అన్నారు. రోజుకు  వారు 11 నుంచి 12 గంటల పాటు విశ్రాంతి లేకుండా స్టీరింగ్ పట్టుకునే ఉంటారన్నారు. అలాంటి వారికి సౌకర్యవంతంగా ఉండేలా ట్రక్కుల్లో డ్రైవర్ల క్యాబిన్లు రూపొందించాలని కంపెనీలను కేంద్ర మంత్రి ఆదేశించారు. ఇప్పటికే విదేశాల్లో ఇలాంటి ఏసీ క్యాబిన్లు ఉన్నాయని ఆయన తెలిపారు. కానీ మన దేశంలో మాత్రం అలాంటి క్యాబిన్లు లేవని ఆయన చెప్పారు. ఇక నుంచైనా.. లారీ,ట్రక్కుల క్యాబిన్లలో ఏసీలు ఉండేలా చూసుకోవాలని ఆదేశించారు.

ఇందు కోసం 18 నెలల సమయం ఇస్తున్నామన్నారు.  వాహనాల్లో  ఏసీలు ఏర్పాటు చేసుకోవడం వలన డ్రైవర్లు మరింత సౌకర్యంగా నడుపుతారని ఆయన తెలిపారు. ఇక లారీల్లోని క్యాబిన్లలో ఏసీ ఏర్పాటు. ఈ లారీల్లో క్యాబిన్లలో ఏసీ ఏర్పాటు చేసుకోవడానికి భారీగా ఖర్చుందని వస్తున్న వార్తలపై కేంద్రం స్పందించింది. ట్రక్కులో ఏసీ బిగించేందుకు కేవలం రూ.10 నుంచి 20 వేల వరకు మాత్రమే ఖర్చు అవుతుందని అంచనా వేసింది. మరి… లారీ డ్రైవర్ల విషయంలో కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments