iDreamPost
iDreamPost
సరిగ్గా ఇంకో 20 రోజుల్లో ప్రభాస్ రాధే శ్యామ్ థియేటర్లలో రాబోతోంది. ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు యూనిట్ సన్నాహాల్లో ఉంది. పాన్ ఇండియా స్థాయిలో మూడు వందల కోట్లకు పైగా బడ్జెట్ తో రూపొందిన ఈ విజువల్ వండర్ మీద అంచనాలు భారీగా ఉన్నాయి. సాహో తర్వాత మూడేళ్ళకు పైగా గ్యాప్ తో వస్తున్న మూవీ కావడంతో ఫ్యాన్స్ చాలా ఉద్విగ్నతతో ఉన్నారు. అయితే కోరుకున్నరేంజ్ లో హైప్ లేదన్న కామెంట్స్ సోషల్ మీడియాలో గట్టిగానే తిరుగుతున్నాయి. రెగ్యులర్ గా ప్రమోషన్ చేసే విషయంలో యువి సంస్థ ఇంకా యాక్టివ్ అవ్వాల్సిన అవసరం చాలా ఉంది. వాలెంటైన్ డే రోజు ఇచ్చిన టీజర్ అంత కిక్ ఇవ్వలేదు
సో ఇప్పుడు నేషన్ వైడ్ పబ్లిసిటీ వేగాన్ని పెంచాల్సిన అవసరం చాలా ఉంది. ముఖ్యంగా తమిళనాడులో సూర్య రూపంలో అడ్డంకి ఎదురుచూస్తోంది . 10న రిలీజ్ కానున్న ఈటి మీద అక్కడ మాములు అంచనాలు లేవు. ఆకాశం నీ హద్దురా, జై భీం రెండూ ఓటిటిలో వచ్చాక సూర్య థియేటర్ల కోసం చేసిన సినిమా ఇదే. అందుకే అభిమానులు గ్రాండ్ వెల్కమ్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. పక్కా మాస్ ఎంటర్ టైనర్ కావడంతో ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా చాలు నెక్స్ట్ డే వచ్చే రాధే శ్యామ్ కు అక్కడ స్క్రీన్ల పరంగా చిక్కులు ఎదురవుతాయి. పైగా ప్రభాస్ ది డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన పీరియాడిక్ లవ్ డ్రామా.
ఇవన్నీ విశ్లేషించుకుని రాధే శ్యామ్ ప్రభావం మన సౌత్ కంటే ఉత్తరాదిలోనే ఎక్కువ ఉండేలా కనిపిస్తోంది. సాహో తెలుగు తమిళంలో ఎంత డిజాస్టర్ అయినా హిందీలో సేఫ్ అయ్యింది. అందుకే ఆ వెర్షన్ విషయంలో నిర్మాతలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సంగీత దర్శకుడిని అక్కడ వేరే సెట్ చేయడానికి కారణం కూడా అదే. దాని సంగతెలా ఉన్నా ఇక్కడా ఫోకస్ పెట్టడం చాలా అవసరం. పైగా కర్ణాటకలో మార్చి 17నుంచి వారం పాటు పునీత్ రాజ్ కుమార్ జేమ్స్ తప్ప వేరే సినిమా ప్రదర్శించరు. ఆపై వారమే 25న ఆర్ఆర్ఆర్ రాబోతోంది. సో రాధే శ్యామ్ జర్నీ అంత సులభం కాదు. స్పీడ్ పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చూద్దాం
Also Read : Tollywood : భారీ సినిమాల రిలీజ్ కు ముందు కొత్త టెన్షన్