iDreamPost
android-app
ios-app

కరోనాతో మృతి చెందిన కొడుకు..కోడలికి రూ.60లక్షల కట్నం ఇచ్చి మరో వివాహం చేసిన అత్త‌మామ‌లు

  • Published May 14, 2022 | 5:37 PM Updated Updated May 14, 2022 | 5:37 PM
  • Published May 14, 2022 | 5:37 PMUpdated May 14, 2022 | 5:37 PM
కరోనాతో మృతి చెందిన కొడుకు..కోడలికి రూ.60లక్షల కట్నం ఇచ్చి మరో వివాహం చేసిన అత్త‌మామ‌లు

కొడుకు చనిపోతే కోడలికి తమ ఆస్తులు ఇవ్వకుండా ఎలా వదిలించుకోవాలా? అని ఆలోచిస్తారు కొంతమంది అత్తమామలు. కానీ మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని థార్ జిల్లాకు చెందిన ఓ యువతి అత్తమామలు మాత్రం కోడలి విషయంలో గొప్ప మనుసుని చాటుకున్నారు. కోడలికి సొంత అమ్మానాన్నలుగా మారారు. కరోనాకు కొడుకు బలి అయిపోయినా కోడలిని సొంత కూతురిలా ఆదరించారు.

థార్ జిల్లాకు చెందిన యుగ్ ప్ర‌కాశ్ తివారీ బ్యాంకు రిటైర్డ్ మేనేజ‌ర్. ఈయ‌న‌కు భార్య‌, కుమారుడు ప్రియాంక్ తివారీ ఉన్నారు. యుగ్ ప్రకాశ్ కుమారుడు ప్రియాంక్ తివారీకి భార్య రీచా, 9 ఏళ్ల కూతురు అన‌న్య ఉన్నారు. వారి కుటుంబం సంతోషంగా సాగేది. కానీ కరోనా మహమ్మారి వారి కుటుంబంలో శోకాన్ని నింపింది. క‌రోనాతో ప్రియాంక్ తివారీ 2021లో ప్రాణాలు కోల్పోయాడు. అప్ప‌టి నుంచి ఆ కుటుంబంలో శోక‌సంద్రంలో మునిగిపోయింది. రీచా త‌న భ‌ర్త గురించే ఆలోచిస్తూ మాన‌సికంగా కుంగిపోయింది. కొడుకు మరణంతో కోడలు రిచా రోజు రోజుకు కృంగిపోతుండటానని మామ యుగ్ ప్ర‌కాశ్ గ‌మ‌నించాడు.బాధపడేవాడు. ఓ పక్క బాధపడుతునే పైకి మాత్రం ధైర్యం ఉండి కోడలిని ఊరడించేవాడు. కోడలిని అలా చూసి చూసి ఆ మామలో ఓ ఆలోచన వచ్చింది.

ఆమెకు కొత్త జీవితాన్ని తిరిగి ఇవ్వాలనుకున్నారు ప్రకాష్. అదే విషయం భార్యకు చెప్పారు. ఆమె కూడా సరైన నిర్ణయం అని భర్తను అభినందించింది. అనుకున్నట్లుగానే రిచా అత్తమామలు ఆమెను అతి బలవంతంగా వివాహానికి ఒప్పించారు. నాగ్‌పూర్‌కు చెందిన వ‌రుణ్ మిశ్రాతో వివాహం కుదిర్చారు. కోడలు రీచాకు ద‌గ్గ‌రుండి అంగ‌రంగ వైభ‌వంగా అక్ష‌య తృతీయ రోజున పెళ్లి చేశారు. అలా అక్షయ తృతీయ రోజున వివాహం చేసిన కోడలికి యుగ్ ప్ర‌కాశ్ తివారీ దంపతులు కట్నంగా రూ.60 లక్షల రూపాయల విలువైన ఆస్తులు రాసి ఇచ్చారు.

 

నాగ్‌పూర్‌లో ప్రియాంక్ తివారీ కొన్న రూ.60లక్షల విలువైన ఓ భ‌వ‌నాన్ని రీచాకు బ‌హుమ‌తిగా ఇచ్చారు. రీచా భ‌విష్య‌త్‌లో ఉన్న‌తంగా సంతోషంగా జీవించాలని ఆశీర్వదించి ఆ భ‌వ‌నం రాసిచ్చామ‌ని యుగ్ ప్ర‌కాశ్ దంప‌తులు తెలిపారు. వివాహం అనంత‌రం వ‌రుణ్ మిశ్రాతో క‌లిసి రీచా, కూతురు అన‌న్య నాగ్‌పూర్ వెళ్లిపోయారు. కోడ‌లికి మ‌రో పెళ్లి చేసిన యుగ్ ప్ర‌కాశ్ దంప‌తుల‌ను అభినందిస్తున్నారు నెటిజన్లు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet