iDreamPost
iDreamPost
Uber Ride : రైడ్ ఛార్జీలను ఉబెర్ పెంచింది. పెట్రోల్, డీజిల్ రేట్లు బాగా పెరగడం, ర్యాపిడో , ఓలా నుంచి ఎదురువుతున్న పోటీని దృష్టిలో ఉంచుకుని ఉబెర్ ఇండియా రైడ్ ఛార్జీల మోతమోగించింది. క్యాబ్ లు వల్ల తమకు పెద్దగా మిగలడంలేదని డ్రైవర్ల అంటున్నారు. ఎక్కువ మంది డ్రైవర్లు ఓలా, ఉబెర్, ర్యాపిడోలను వాడుతున్నారు. ఎందులో ఎక్కువ రేట్లు ఉంటే దానికే స్విచ్ అవుతున్నారు. అందుకే డ్రైవర్లను ఎట్రాక్ట్ చేయడానికి వాళ్ల మాటనూ వినాలనుకుంది ఉబెర్.
ఇంధన ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఆ ప్రభావం క్యాబ్, ట్యాక్సీ, ఆటోలపై పడుతోంది. ఆ రేట్ల వల్ల మిగిలేది తక్కువగా ఉందికాబట్టి, రేట్లు పెంచాలని డ్రైవర్ల అసోసియేషన్ కంపెనీ దృష్టికి తీసుకెళ్లింది..
ముంబైలో 15శాతం, ఢిల్లీలో 12 శాతం మేర ఎప్రిల్ లోనే ఛార్జీలను ఉబెర్ పెంచింది. పెరిగిన ఛార్జీలు సరిపోవడంలేదని డ్రైవర్లు వాదించారు. అంటే దేశవ్యాప్తంగా ఇప్పుడున్న ఛార్జీలను మరో 20శాతం వరకు పెంచిందన్నది మార్కెట్ నిపుణుల మాట.
మనం ఉబర్ బుక్ చేసుకొంటో రైడ్ డెస్టినేషన్ గురించి డ్రైవర్లకు తెలియదు. అందుకు వాళ్లు కాల్ చేసి, ఎక్కడకు వెళ్లాలో కనుక్కొని, వద్దు అనుకొంటే క్యాన్సిల్ చేస్తున్నారు. దీనివల్ల యూజర్లకు టైం వేస్ట్. అందుకే రైడ్ డెస్టినేషన్ గురించి డ్రైవర్లకు ముందుగానే తెలిసేలా ఉబెర్ ఏర్పాట్లు చేస్తోంది. అంతేకాదు, రైడర్ నుంచి పేమెంట్ క్యాష్ లేదా ఆన్‌లైన్ ఏ రూపంలో వచ్చేది కూడా డ్రైవర్లకు సమాచారం అందించనుంది. ఇదంతా ట్రిప్‌కు ముందే డ్రైవర్ కు డిస్ ప్లే అవుతుంది.
ఒకవేళ మనం క్యాన్సిల్ చేస్తే, ఆ ఛార్జీల గోల ఎక్కువగానే ఉంది. డ్రైవర్ కి రావడానికి చాలా టైం పడితే, యూజర్లు సహజంగానే క్యాన్సిల్ చేస్తారు. దీనికి కొన్నిసార్లు క్యాన్సిలేషన్ ఛార్జీలు పడుతున్నాయి. వీటన్నింటిని పరిష్కరించనుంది ఉబెర్.
ఓలా, ఉబెర్ ప్రతినిధులతో సమావేశమైన 10రోజుల తర్వాత సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అధారిటీ (సీపీపీఏ) నోటీసులనిచ్చింది. వినియోగదారుల హక్కులకు భంగం కలిగించినందుకు ఓలా, ఉబెర్ లు ఈ నోటీసులకు సమాధానమివ్వాల్సి ఉంది.
ఇటీవల సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అధారిటీ (సీపీపీఏ) రైడ్ షేరింగ్ సంస్థలకు హెచ్చరించింది. రైడ్ క్యాన్సిలేషన్, క్యాన్సిలేషన్ ఛార్జీలు,ర్యాండమ్‌గా పెరుగుతున్న ధర, ప్రయాణికులు క్యాబ్ కోసం ఎదురుచూపులు, ట్రిప్పులను రద్దు చేయమని యూజర్లను డ్రైవర్లు ఇబ్బంది పెట్టడం వంటి సమస్యల్ని పరిష్కరించాలని ఆదేశించింది. క్యాబ్ అగ్రిగేటర్‌లను రైడ్ క్యాన్సిలేషన్‌లు, డీ ఫాల్ట్‌గా మారిపోతున్న ఛార్జీల అల్గారిథమ్‌ల అప్ డేట్ చేయాలని కోరింది. ఉబెర్, ఓలాతో సహా ఇతర రైడ్ షేరింగ్‌లకు సంబంధించిన అల్గారింథమ్‌లను మార్చేందుకు 30రోజుల సమయం ఇచ్చింది.