Idream media
Idream media
రసాయన శాస్త్రంలో విశేష సేవలు అందించిన ఇద్దరు మహిళా శాస్త్రవేత్తలకు ప్రతిష్టాత్మకంగా నోబెల్ బహుమతి-2020 వరించింది.”జీనోమ్ ఎడిటింగ్” విధానంలో చేసిన పరిశోధనలకు గాను ఫ్రెంచ్ ప్రొఫెసర్ ఇమ్మాన్యూయెల్ చార్పెంటీర్,అమెరికన్ బయోకెమిస్ట్ జెన్నీఫర్ ఏ దౌడ్నా సంయుక్తంగా నోబెల్ పురస్కారానికి ఎంపిక చేసినట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రకటించింది.
ఇరువురు మహిళా శాస్త్రవేత్తలు స్ట్రెప్టోకోకస్ బ్యాక్టీరియం ఇమ్యూన్ వ్యవస్థను అధ్యయనం చేసి జన్యువులను వేరు చేసేందుకు ఓ కొత్త పరికరాన్ని అభివృద్ధి చేశారు. జీనోమ్ ఎడిటింగ్ టెక్నాలజీతో చాలా పదునైన సీఆర్ఐఎస్‌పీఆర్/సీఏఎస్9 జెనెటిక్ సిజర్స్‌ను అభివృద్ధి పరిచారు.ఈ విధానం ద్వారా జంతువులు, మొక్కలు, సూక్ష్మ జీవుల డీఎన్ఏను మార్చగలిగే అవకాశం ఉంటుంది.ఎలాంటి DNA కణానైన అత్యంత నియంత్రిత పద్ధతిలో కత్తిరించవచ్చని శాస్త్రవేత్తలు ఇమ్మాన్యూయెల్, జెన్నీఫర్ నిరూపించారు.
ఈ కొత్త సాంకేతికత కణజీవ శాస్త్రంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలకనుంది. వైరస్‌లలో ఉండే డీఎన్ఏలను కూడా నూతనంగా కనుగొన్న సీఆర్ఐఎస్‌పీఆర్ జెనెటిక్ సీజర్లు వేరు చేయగలవు.ఇక వంశపారంపర్యం కారణంగా వచ్చే వ్యాధులను ఈ నూతన జెనెటిక్ సీజర్లతో నయం చేసే అవకాశం ఉంది.అలాగే క్యాన్సర్ చికిత్సలోను నూతన విధానాల అభివృద్ధికి వీరి పరిశోధనలు దోహద పడతాయని నోబెల్ ప్రైజ్ కమిటీ పేర్కొంది.