Uppula Naresh
Uppula Naresh
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) ప్రయాణిలకు మరో బంపర్ ఆఫర్ ను తీసుకొచ్చింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అదిరిపోయే ఆఫర్ ప్రకటించడంతో ప్రయాణికులు ఎగిరి గంతేస్తున్నారు. ఇంతకు TSRTC ప్రకటించిన తాజా ఆఫర్ ఏంటంటే? టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ RTCని లాభాల్లో పరుగెత్తించేందుకు సరికొత్త ఆలోచనలు చేస్తున్నారు. తాజాగా మరో ఆఫర్ ప్రకటించారు. ఆగస్టు 15వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తిరిగే పల్లె వెలుగు సర్వీసుల్లో సీనియర్ సిటిజన్లకు 50 శాతం రాయితిని ఇస్తున్నట్లు వెల్లడించింది.
24 గంటల అపరిమిత ప్రయాణానికి సంబంధించిన టీ-24 టికెట్ ధర కేవలం రూ. 50గా నిర్ణయించింది. దీంతో పాటు 12 ఏళ్ల లోపు పిల్లలకు కూడా ఈ టీ-24 టికెట్ రూ.50కే ఇవ్వనున్నట్లు తెలిపింది. ఇదే కాకుండా నగరంలో అపరిమిత ప్రయాణానికి ఈ టీ-24 టికెట్ ను కేవలం రూ.75కే ఇవ్వనున్నట్లు టీఎస్ఆర్టీసీ తెలిపింది. మరో విషయం ఏంటంటే? ఈ ఆఫర్ ఆగస్టు 15వ తేదీ ఒక్క రోజు మాత్రమే ప్రయాణికులకు అందుబాటులో ఉంటుందని పేర్కొంది. అయితే ప్రస్తుతం సాధారణ ప్రయాణికులకు టి-24 టికెట్ రూ.120 ఉండగా.. మహిళలు, సీనియర్ సిటీజన్లకు రూ.100, 12 ఏళ్లలోపు పిల్లలకు రూ.80 గా నిర్ణయించారు.
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రయాణికులకు ప్రత్యేక రాయితీలను #TSRTC ప్రకటించింది. రాష్ట్రంలోని పల్లె వెలుగు బస్సుల్లో ప్రయాణించే సీనియర్ సిటిజన్లతో పాటు హైదరాబాద్ సిటీలోని సాధారణ ప్రయాణికులకు టికెట్ లో భారీ రాయితీలను కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది.
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో…
— VC Sajjanar – MD TSRTC (@tsrtcmdoffice) August 13, 2023
ఇది కూడా చదవండి: ఇకపై అలాంటి మందులనే రాయాలి.. లేదంటే డాక్టర్లపై సస్పెన్షన్!