Idream media
Idream media
తెలంగాణ మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎన్నికల్లో అధికార తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఏకపక్ష విజయాన్ని కైవసం సాధించింది. మొత్తం 120 మున్సిపాలిటీల్లో 110 మున్సిపాలిటీ పీఠాలను, 10 కార్పొరేషన్లను గెలుపొందింది. మరోవైపు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలోనూ నూతన పాలక వర్గాలు కొలువుతీరాయి.
అత్యధిక స్థానాలు కైవసం చేసుకున్న అధికార టీఆర్‌ఎస్ పట్టణాలపై పూర్తిస్థాయిలో పట్టు సాధించింది. తొమ్మిది కార్పొరేషన్లనూ టీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేసింది. అలాగే చైర్ పర్సన్ ఎన్నికలు జరిగిన 118 మున్సిపాలిటీల్లో 110 మున్సిపాలిటీలను (రెండు మున్సిపాలిటీల్లో చైర్‌పర్సన్ ఎన్నిక వాయిదాపడగా) కైవసం చేసుకుంది.
Read Also: మున్సిపల్ ఎన్నికల పూర్తి ఫలితలు
120 మున్సిపాల్టీలు, 9 కార్పొరేషన్ల పాలక వర్గాలు సోమవారం కొలువుదీరాయి. నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ప్రమాణం స్వీకరించారు. మధ్యాహ్నం చైర్‌పర్సన్లు, వైస్ చైర్‌పర్సన్లు, మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నిక జరిగింది. దాదాపు అన్నిచోట్లా గులాబీ పార్టీ నేతలు పదవులు స్వీకరించారు. పలు మున్సిపాలిటీల్లో స్వతంత్రులు, ప్రతిపక్ష పార్టీల నుంచి గెలిచిన పలువురు టీఆర్‌ఎస్ పార్టీకి మద్దతిచ్చారు.
చౌటుప్పల్, యాదగిరి గుట్ట, భూత్పూర్, పెద్ద అంబర్ పేట, తుక్కుగూడలో కాంగ్రెస్ నుంచి గెలిచిన కౌన్సిలర్లు కూడా టీఆర్‌ఎస్‌లోకి ఫిరాయించారు. సంక్షేమం కోసం అధికార పార్టీకి అండగా ఉన్నామని చెప్పుకున్నారు. దీంతో కాంగ్రెస్ నేతలకు టీఆరెస్ నేతలకు కొన్ని చోట్ల ఘర్షణలు చోటుచేసుకున్నాయి.
Read Also: కారు కింద కాంగ్రెస్, బీజేపీ పచ్చడి
5 ఉమ్మడి జిల్లాలను టీఆర్‌ఎస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. ఖమ్మంలో ఐదు, నిజామాబాద్‌లో ఏడు, కరీంనగర్‌లో 16, వరంగల్‌లో 10, మెదక్ లో 13స్థానాలను పూర్తిస్థాయిలో గెలుచుకుంది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 20 మున్సిపాలిటీల్లో 17 టీఆర్‌ఎస్ గెలుచుకోగా మక్తల్, ఆమన్‌గల్లు బీజేపీ, వడ్డేపల్లిని కాంగ్రెస్ దక్కించుకుంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు కలిపి 29 ఉండగా 25 టీఆర్‌ఎస్ గెలుచుకుంది. మణికొండ, తుర్కయంజాల్ కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లగా జల్‌పల్లి ఎంఐఎం దక్కించుకుంది. మేడ్చల్ మున్సిపాలిటీ ఎన్నిక వాయిదా పడింది. ఉమ్మడి నల్లగొండలో 18మున్సిపాలిటీలకు 16చోట్ల టీఆర్‌ఎస్, చండూరులో కాంగ్రెస్ గెలువగా.. నేరేడుచర్ల పెండింగ్‌లో ఉంది. ఆదిలాబాద్‌లోని భైంసా ఎంఐఎం గెలుచుకుంది..
Read Also: పురపోరులో కారు జోరు
మేడ్చల్‌తోపాటు, సూర్యాపేట జిల్లా నేరేడుచర్లలో చైర్‌పర్సన్ల ఎన్నిక వాయిదా పడింది. మేడ్చల్ మున్సిపాలిటీలో 23వార్డుల్లో టీఆర్‌ఎస్ 14 వార్డులను దక్కించుకోగా.. సోమవారం కోరం లేకపోవడంతో మంగళవారానికి వాయిదా వేశారు. నేరేడుచర్లలో ఎక్స్‌అఫీషియో సభ్యుడి ఓటుహక్కు విషయంలో సందిగ్ధత తలెత్తడంతో అక్కడకూడా ఎన్నిక వాయిదాపడింది. తెలంగాణ రాష్ట్ర సమితి గెలుచుకున్న 119 పురపాలక సంఘాలతో పాటు మేడ్చెల్, నేరేడుచర్ల ఎంపిక చేసిన టిఆర్ఎస్ పార్టీ చైర్మన్లు, వైస్ చైర్మన్, మేయర్, డిప్యూటీ మేయర్లుగా సుమారుగా 240 మందికి టియారెస్ పార్టీ నాయకులకు పదవులు దక్కాయి.