iDreamPost
android-app
ios-app

రెండు చోట్లా టీఆర్‌‘‘ఎస్సే’’ : అక్కడలా, ఇక్కడిలా

రెండు చోట్లా టీఆర్‌‘‘ఎస్సే’’ : అక్కడలా, ఇక్కడిలా

తెలంగాణలో హైదరాబాద్‌ – రంగారెడ్డి – మహబూబ్‌నగర్‌, నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ పట్టభద్రుల నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ ఆది నుంచీ ఆధిక్యంలోనే కొనసాగుతోంది. మొదటి ప్రాధాన్య ఓట్లలో ఆ పార్టీ హవా కొనసాగుతూనే ఉంది. హైదరాబాద్‌లో మొత్తం ఆరు రౌండ్లు పూర్తయ్యేసరికి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని వాణీదేవికి 1,05,710 ఓట్ల తో మొదటి స్థానంలో నిలిచారు. బిజెపి అభ్యర్థి రామ చంద్ర రావు 98, 084 ఓట్లు పొందారు. వాణి 7,626 ఓట్ల ఆధిక్యం సాధించారు.

ఖమ్మం – వరంగల్ – నల్లగొండ నియోజకవర్గంలో మొత్తం ఆరు రౌండ్లు పూర్తయ్యేసరికి పల్లా రాజేశ్వర్‌రెడ్డి 27,500 ఆధిక్యంలో కొనసాగుతున్నారు. బుధవారం ప్రారంభమైన ఓట్ల లెక్కింపు ఇంకా జరుగుతూనే ఉంది. మొదటి ప్రాధాన్యత ఓట్ల లో పల్లాకు 1,10,840 ఓట్లు పోలయ్యాయి. రెండో స్థానంలో ఉన్న మల్లన్నకు 83,290 ఓట్లు వచ్చాయి. ఇక టీజేఎస్‌ అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం 70,072 ఓట్లతో మూడో స్థానంలో కొనసాగుతున్నారు. ఆ తరువాతి స్థానంలో బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి 39,107 కొనసాగుతున్నారు.

హైదరాబాద్‌లో హోరాహోరీ

హైదరాబాద్‌లో స్థానం ఓట్ల లెక్కింపులో తొలి రౌండ్‌ నుంచీ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి వాణీదేవి ఆధిక్యం ప్రదర్శిస్తున్నారు. మొత్తం ఆరు రౌండ్లు పూర్తయ్యేసరికి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని వాణీదేవికి 1,05,710 ఓట్ల తో మొదటి స్థానంలో నిలిచారు. బిజెపి అభ్యర్థి రామ చంద్ర రావు 98, 084 ఓట్లు పొందారు. స్వతంత్ర అభ్యర్థి ప్రొఫెసర్‌ కె.నాగేశ్వర్‌కు 50,450 ఓట్లతో మూడు స్థానంలో కొనసాగుతున్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థి చిన్నారెడ్డికి 29,627 ఓట్లు పోలయ్యాయి. 50 శాతానికి ఒక ఓటు అదనంగా వచ్చిన వారు విజేతగా నిలువనున్న నేపథ్యంలో విజేత ఎవరో తేలాలంటే రెండు స్థానాల్లోనూ రెండో ప్రాధాన్య ఓటు లెక్కింపు అనివార్యమైంది.

కోదంరాంకు మించిన మల్లన్న

నల్లగొండ స్థానంలో స్వతంత్ర అభ్యర్థి తీన్మార్‌ మల్లన్న అనూహ్య దూకుడు రాజకీయ వర్గాలను విస్మయానికి గురి చేస్తోంది. మొదటి ప్రాధాన్య ఓట్లలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డికి దీటుగా ఓట్లు పొందుతూ మల్లన్న రెండో స్థానంలో ఉన్నారు. టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం కంటే కూడా ఎక్కువ ఓట్లు మల్లన్న పొందారు. మరోవైపు హైదరాబాద్‌ స్థానంలో అందరి అంచనాలను తలకిందులు చేస్తూ స్వతంత్ర అభ్యర్థి ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ మొదటి ప్రాధాన్య ఓట్లు పొందడంలో వెనుబడ్డారు. ఎక్కువ వ్యత్యాసంతో మూడో స్థానంలో ఉన్నారు.