iDreamPost
android-app
ios-app

2 కాదు 10కి పదే మా ఇద్దరి లక్ష్యం.. స్పీడ్‌ పెంచిన తుమ్మల, పొంగులేటి

  • Published Oct 19, 2023 | 8:17 AMUpdated Oct 19, 2023 | 8:17 AM
  • Published Oct 19, 2023 | 8:17 AMUpdated Oct 19, 2023 | 8:17 AM
2 కాదు 10కి పదే మా ఇద్దరి లక్ష్యం.. స్పీడ్‌ పెంచిన తుమ్మల, పొంగులేటి

తెలంగాణ రాజకీయాల్లో ఖమ్మం కీలక పాత్ర పోషిస్తుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇక్కడ అధిక్యం సాధించిన పార్టీ.. రాష్ట్రంలో చక్రం తిప్పుతుందని భావిస్తారు నాయకులు. పార్టీ ఏదైనా సరే.. ఖమ్మంలో తప్పక గెలవాలని తీవ్రంగా కృషి చేస్తారు. ఆఖరికి తెలంగాణ రాజకీయాల్లో రాణించాలనుకునే వారు.. తొలిసారి పోటీ చేసే వారు సైతం.. ఖమ్మానికే తొలి ప్రాధాన్యత ఇస్తారు. రాష్ట్ర రాజకీయాల్లో ఖమ్మం అంతటి ప్రాధాన్యతను కలిగి ఉంది. రాష్ట్ర రాజకీయాల్లో ఎంతో కీలకమైన ఖమ్మం నియోజకవర్గంలో.. తెలంగాణ వచ్చిన నాటి నుంచి బీఆర్‌ఎస్‌ పార్టీ ఆధిపత్యమే కొనసాగుతూ వస్తోంది. కానీ తాజా అసెంబ్లీ ఎన్నికల ముందు మాత్రం.. కారు పార్టీకి భారీ షాక్‌ తగిలింది.

ఇక్కడ బీఆర్‌ఎస్‌ పార్టీకి ఎంతో కీలకమైన ముఖ్యనేతలు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. ఊహించని రీతిలో కారు దిగి.. హస్తంతో చేయి కలిపి.. భారీ షాక్‌ ఇచ్చారు. బీఆర్‌ఎస్‌ పార్టీకి ఇది కోలుకోలేని దెబ్బ అనే చెప్పవచ్చు. కీలకనేతలిద్దరి రాక కాంగ్రెస్‌కు బాగానే కలిసి వస్తుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే ఖమ్మంలో వీరికి చెక్‌ పెట్టగల మరో ముఖ్య నేత పువ్వాడ అజయ్‌. ప్రస్తుత ఎన్నికల్లో వీరి ముగ్గురి మధ్య హోరాహోరి పోరు సాగనుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా తుమ్మల కీల వ్యాఖ్యలు చేశారు. ఖమ్మంలో రెండు కాదు మొత్తం పదికి పది నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ గెలుపే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.

తామిద్దరం ఒక్కటేనని, పాలేరు, ఖమ్మం నియోజకవర్గాలే కాకుండా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ విజయమే తమ ఉమ్మడి లక్ష్యమని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, టీపీసీసీ ప్రచార కమిటీ కో-చైర్మన, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఖమ్మంలోని ఎస్‌ఆర్‌ కన్వేన్షన హాల్లో బుధవారం నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో తుమ్మల, పొంగులేటి మాట్లాడారు. ఈ సందర్భంగా తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ పాలేరు నియోజకవర్గంలో తాను పెద్ద పాలేరుగా ఉంటానన్న మాట నిలుపుకున్నానని తెలిపారు. ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఆదే విధంగా పాలేరు ప్రజలతో కలిసి ఉంటారని హామీ ఇచ్చారు. ప్రజలకు సేవ చేసేందుకే తాము ఇద్దరు రాజకీయాల్లో ఉన్నామన్నారు. భవిష్యతలోనూ ప్రజాసేవ కోసమే పనిచేస్తామని, నీతిమాలిన రాజకీయాలు చేయబోమని తెలిపారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి