iDreamPost
android-app
ios-app

రాహుల్‌ గాంధీ పరువు తీసిన కాంగ్రెస్‌ నేతలు.. ములుగులో మళ్లీ అదే పొరపాటు

  • Published Oct 19, 2023 | 9:22 AMUpdated Oct 19, 2023 | 9:22 AM
  • Published Oct 19, 2023 | 9:22 AMUpdated Oct 19, 2023 | 9:22 AM
రాహుల్‌ గాంధీ పరువు తీసిన కాంగ్రెస్‌ నేతలు.. ములుగులో మళ్లీ అదే పొరపాటు

మిగతా సమయాల్లో ఎలా ఉన్నా సరే.. ఎన్నికల వేళ నాయకులు చేసే ప్రతి పని కీలకమే. మరీ ముఖ్యంగా వారు మాట్లాడే మాటలు ప్రజలపై బాగా ప్రభావం చూపుతాయి. ఇక ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చే స్పీచ్‌లు చాలా పవర్‌ఫుల్‌గా ఉండాలి. ప్రజలను ఆకట్టుకునేలా మాట్లాడటం ఎంత ముఖ్యమో.. సరైన సమాచారం తెలుసుకుని మాట్లాడటం కూడా అంతే ముఖ్యం. ఏమాత్రం తేడా వచ్చినా.. వేల మంది ప్రజల ముందు పరువు తీసుకోవడం మాత్రమే కాక.. ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయి. ఎవరో చిన్నా నేతలు ఇలా మాట్లాడితే ఓకే కానీ.. అధినేత నోటి వెంట తప్పుడు సమాచారం బయటకు వస్తే.. అది మాత్రం చాలా వ్యతిరేక ప్రభావం చూపడమే కాక అభాసుపాలవ్వాల్సి వస్తుంది. ఇక తాజాగా కాంగ్రెస్‌ ముఖ్య నేత రాహుల్‌ గాంధీకి ఇదే పరిస్థితి ఎదురయ్యింది. పార్టీ నేతలే ఆయన పరువు తీశారని కామెంట్స్‌ చేస్తున్నారు బీఆర్‌ఎస్‌ నేతలు. ఇంతకు ఏం జరిగింది అంటే..

తెలంగాణలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో.. కాంగ్రెస్ పార్టీ కూడా దూకుడు పెంచింది. అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించిన కాంగ్రెస్.. బుధవారం నుంచి ప్రచారం ప్రారంభించింది. దీనిలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ రాష్ట్రానికి వచ్చారు. ముందుగా రామప్ప దేవాలయాన్ని సందర్శించిన రాహుల్, ప్రియాంక.. ఆరు గ్యారెంటీల కార్డును శివయ్య దగ్గర పెట్టి ప్రత్యేక పూజలు నిర్వహించి.. అనంతరం విజయభేరి యాత్రను ప్రారంభించారు. ఆ తర్వాత అక్కడే నిర్వహించిన భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. ఈ క్రమంలోనే రాహుల్ గాంధీ గతంలో చేసిన పొరపాటునే ములుగు సభలో మరోసారి రిపీట్ చేశారు.

మళ్లీ అదే మిస్టేక్‌..

గతంలో తెలంగాణలో ప్రసంగించిన రాహుల్ గాంధీ.. బీఆర్ఎస్ ప్రభుత్వం భారీ అవినీతికి పాల్పడుతుందంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. అంతేకాక.. కేవలం కాళేశ్వరం ప్రాజెక్టులోనే లక్ష కోట్ల అవినీతి చేసిందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు రాహుల్‌ గాంధీ. అదిగో అక్కడే ఆయన పప్పులో కాలేసి.. గతంలో చేసిన మిస్టేకే మళ్లీ తాజాగా ములుగు సభలో కూడా చేశారు చేశారు. దాంతో రాహుల్‌ గాంధీ వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్‌ నేతలు ఓ రేంజ్‌లో విమర్శలు చేస్తున్నారు.

కేవలం రాసిచ్చిన స్క్రిప్ట్‌ని బట్టి పట్టి మాట్లాడితే ఇలానే ఉంటుంది. రాహుల్‌ ప్రసంగంతోనే అర్థం అవుతుంది.. ఆయనకు తెలంగాణ గురించి ఏమాత్రం అవగాహన ఉందో అంటూ ఎద్దేవా చేస్తున్నారు. ఇంతకు రాహుల్‌ గాంధీ చేసిన మిస్టేక్‌ ఏంటి అంటే… కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తానికి ఖర్చయ్యిందే.. 80-85 వేల కోట్ల రూపాయలు. కాన రాహుల్‌ గాంధీ మాత్రం కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో లక్ష కోట్ల రూపాయల అవనీతి జరిగింది అంటున్నారు. మరి ఇది ఎలా సాధ్యం అంటూ బీఆర్‌ఎస్‌ నేతలు రాహుల్‌ గాలి తీసేశారు. ఇది కాంగ్రెస్‌ నేత అవగాహన లేమికి నిదర్శనమంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.

కీలకమైన ఎన్నికల ప్రచార సభలో కూడా రాహుల్‌ గాంధీ మళ్లీ అదే మిస్టేక్‌ చేయడంతో.. ఆయనపై ఓ రేంజ్‌లో ట్రోలింగ్‌ జరుగుతుంది. లోకల్ నేతలు రాసిచ్చిన స్క్రిప్ట్ చదవటం తప్ప ఆయనకు రాష్ట్రం గురించి ఏమీ తెలియదంటూ బీఆర్ఎస్ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. ఇలాంటి లెక్కల విషయంలో.. ఒకసారి తెలిసీ తెలియక జరిగిన పొరపాటును సరిదిద్ధుకోవాల్సింది పోయి.. అదే పొరపాటును మళ్లీ మళ్లీ చేయటం వల్ల.. రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ కూడా ప్రజల్లో అబాసుపాలవుతుందంటూ సూచిస్తున్నారు గులాబీ నేతలు. మరి కాంగ్రెస్‌ నేతలు ఇప్పటికైనా కళ్లు తెరుస్తారో లేదో చూడాలి. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి