iDreamPost
android-app
ios-app

నిజామాబాద్‌ రాజకీయాల్లో మాటల యుద్ధం.. అరవింద్‌ మాటలకు ఎమోషనల్‌ అయిన కవిత

  • Published Oct 18, 2023 | 2:13 PMUpdated Oct 18, 2023 | 2:13 PM
  • Published Oct 18, 2023 | 2:13 PMUpdated Oct 18, 2023 | 2:13 PM
నిజామాబాద్‌ రాజకీయాల్లో మాటల యుద్ధం.. అరవింద్‌ మాటలకు ఎమోషనల్‌ అయిన కవిత

తెలంగాణలో ఎన్నికల నగరా మోగింది. పార్టీలన్ని.. దూకుడుగా ముందుకు వెళ్తున్నాయి. ఇక అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం హోరాహోరిగా సాగుతోంది. ఇక తెలంగాణ రాజకీయాల్లో నిజామాబాద్‌లో పొలిటికల్‌ వాతావరణం ఎప్పుడు హాట్‌ హాట్‌గానే ఉంటుంది. నిజమాబాద్‌ ఎంపీగా ఉన్న బీజేపీ నేత అరవింద్‌ సందర్భం దొరికిన ప్రతి సారి బీఆర్‌ఎస్‌పై విమర్శలు చేస్తుంటారు. కేసీఆర్‌ కుటుంబాన్ని మరీ ముఖ్యంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను టార్గెట్‌ చేస్తూ.. విమర్శలు చేస్తూనే ఉంటారు. ఆమె కూడా అంతే స్ట్రాంగ్‌గా కౌంటర్‌ ఇస్తారు. ప్రస్తుతం ఎన్నికల సమయం కావడంతో.. తాజాగా మరోసారి నిజమాబాద్‌లో.. ఎమ్మెల్సీ కవిత, ఎంపీ అరవింద్‌ మధ్య మాటల యుద్ధం రాజుకుంది. దాంతో అరవింద్‌ కామెంట్స్‌పై స్పందిస్తూ కవిత ఎమోషనల్‌ అయ్యారు. ఆ వివరాలు..

ఎన్నికల మేనిఫెస్టోలో బీఆర్‌ఎస్ ఇచ్చిన హామీలపై విమర్శలు చేస్తూ.. ఎంపీ అరవింద్‌ అనుచిత వ్యాఖ్యలు చేశారు. జీవిత బీమా పేరుతో ప్రజలకు ఇవ్వడం ఏమో కానీ… కవితను ఉద్దేశిస్తూ నువ్వు చచ్చిపోతే 20 లక్షలు ఇస్తా… మీ అన్న చచ్చిపోతే పది లక్షలు ఇస్తా… మీ నాన్న చచ్చిపోతే అంటూ నోటికి తోచిన విధంగా.. కనీసం మహిళ అనే గౌరవం కూడా లేకుండా తీవ్ర విమర్శలు చేశారు. ఇక అరవింద్‌ కామెంట్స్‌పై కవిత అదే స్థాయిలో స్పందించారు. ఈ సందర్భంగా ఓ వీడియో రిలీజ్‌ చేస్తూ.. భావోద్వేగానికి గురయ్యారు. ప్రజలారా! మీ ఇంట్లో ఆడబిడ్డలను ఇలానే అంటే ఊరుకుంటారా అని ఈ సందర్భంగా కవిత జనాలను ప్రశ్నించారు.

కవిత అరవింద్‌ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ‘‘తెలంగాణ ప్రజలకు నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. ఆడబిడ్డనైన నన్ను అరవింద్ అనే మాటలను.. మీ ఇంట్లోని ఆడపిల్లలను అంటే మీరు ఊరుకుంటారా.. అంగీకరిస్తారా. నేను రాజకీయాల్లో ఉన్నా కాబట్టి, సీఎం కేసీఆర్ బిడ్డను కాబట్టి నన్ను ఏది అన్నా ఒప్పుకుందామా.. తెలంగాణలో ఇలాంటి రాజకీయాలను అనుమతిద్దామా.. నిజామాబాద్‌లో ఓడిపోయిన తర్వాత కూడా నేను హుందాగానే ఉన్నాను. కానీ ఎంపీగా విజయం సాధించిన వ్యక్తి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం మానేసి నన్ను, నా కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారు’’ అని మండి పడ్డారు.

‘‘ప్రజాసేవలో ఉన్నప్పుడు పని చేయకపోతే ప్రజలు ప్రశ్నిస్తారు అంతేకానీ.. చచ్చిపోతే 20 లక్షలు ఇస్తా… మీ అన్న చచ్చిపోతే పది లక్షలు ఇస్తా… మీ నాన్న ఇట్లా అనడమేంటని’’ కవిత ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి భాషాప్రయోగం రాజకీయాల్లో ఎంత వరకు సమంజమని ఈ సందర్భంగా ఆమె ప్రశ్నించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌ అవుతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి