Idream media
Idream media
ఆంధ్రప్రదేశ్‌లో ఉభయగోదావరి జిల్లాలు, కృష్ణా–గుంటూరు జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కౌటింగ్ జరుగుతోంది. తెలంగాణలో పట్టభద్రలు కోటాలో ఎన్నికలు జరిగిన రెండు ఎమ్మెల్సీ స్థానాల ఓట్లు ఈ రోజు లెక్కిస్తున్నారు. ఉదయం ప్రారంభమైన లెక్కింపు కొనసాగుతోంది. బ్యాలెట్ పద్ధతిలో ప్రాధాన్యతా ఓటు విధానంలో ఎన్నికలు జరిగాయి. ప్రస్తుతం కౌటింగ్ సిబ్బంది ఓట్లను వేరు చేసి, 25 చొప్పన కట్టలు కడుతున్నారు. మొదటి ప్రాధాన్యతా ఓట్లను ముందుగా లెక్కించనున్నారు.
తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కౌటింగ్ కాకినాడలో జేఎన్టీయూ ప్రాంగణంలో జరుగుతోంది. కృష్ణ, గుంటూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు గుంటూరులోని ఏసీ కాలేజీలో చేపడుతున్నారు. ఈ నెల 14న జరిగిన ఎన్నికల్లో ఉపాధ్యాయులు ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బరిలో 8 మంది నిలుచున్నారు. రెండు జిల్లాలో 17,647 ఓటర్లు ఉన్నారు. వీరిలో 16,054 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
గుంటూరు, కృష్ణా జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కోసం 19 మంది బరిలో నిలుచున్నారు. ఈ రెండు జిల్లాల్లో 13,505 ఓటర్లు ఉన్నారు. వీరిలో 12,554 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
మొదటి ప్రాధాన్యతా ఓట్లను ముందుగా లెక్కించనున్నారు. మొత్తం పోలైన ఓట్లలో 50 శాతాని కన్నా ఒక ఓటు ఎక్కువగా మొదటి ప్రాధాన్యతా ఓట్లు వచ్చిన అభ్యర్థి గెలుపొందినట్లు ప్రకటిస్తారు. ఇలా ఫలితం తేలకపోతే ఎలమినేషన్ విధానంలో ఫలితం తేలుస్తారు. మొదటి ప్రాధాన్యతా ఓటు చూపిస్తూ 1వ సంఖ్య వేయకుండా.. ఇతర సంఖ్యలు వేసినా వాటిని చెల్లనివిగా గుర్తిస్తారు. ఈ ఎన్నికలకు రాజకీయ పార్టీలు దూరంగా ఉన్నాయి.
తెలంగాణలో రెండు స్థానాలు..
తెలంగాణలో హైదరాబాద్ – రంగారెడ్డి – మహబూబ్‌నగర్, వరంగల్ – ఖమ్మం – నల్గొండ జిల్లాల పట్టభద్రుల ఎన్నికల ఓట్లను లెక్కిస్తున్నారు. హైదరాబాద్ – రంగారెడ్డి – మహబూబ్‌నగర్ జిల్లాల స్థానంలో 3, 57, 354 ఓట్లు పోలయ్యాయి. వీటిని సరూర్‌నగర్‌లో లెక్కిస్తున్నారు. వరంగల్ – ఖమ్మం – నల్గొండ జిల్లాల స్థాణంలో 3, 86, 320 ఓట్లు పోలయ్యాయి. వీటిని నల్గొండలోని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోదాములో లెక్కిస్తున్నారు.
ప్రధాన పార్టీల అభ్యర్థులు ఈ ఎన్నికల్లో పోటీ చేశారు. స్వంత్రులు కూడా బరిలో నిలుచున్నారు. ఓట్లను గుర్తులు వారిగా విభజించి కట్టలు కట్టే ప్రక్రియ ఈ రోజు రాత్రి 8 గంటలకు పూర్తవుతుందని అంచనా వేస్తున్నారు. ఆ తర్వాత లెక్కింపు ప్రక్రియ ప్రారంభించనున్నారు. రాత్రి 10 గంటలకు తొలి రౌండ్ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. తొలి ప్రాధాన్యతో ఓట్లలోనే ఫలితం తేలుతుందని అంచనా వేస్తున్నారు. అలా రాని పక్షంలో ఎలిమినేషన్ వి«ధానం అమలు చేయనున్నారు.