Idream media
Idream media
ప్రపంచ వ్యాప్తంగా దేశాలన్నీ ఎదురుచూస్తున్న అంశం కరోనా వ్యాక్సిన్. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వ్యాక్సిన్ త్వరలోనే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకూ కరోనా కట్టడికి పోరాడిన దేశాలన్నీ ఇప్పుడు ఆ వ్యాక్సిన్ ముందుకు తమ ప్రజలకే వేయించుకునేందుకు పోరాడుతున్నాయి. వ్యాక్సిన్ ముందుగా మాకు కావాలంటే మాకు కావాలంటూ ఉత్సహం చూపుతున్నాయి. మరోవైపు టీకాను సొంతం చేసుకోవడానికి అనేక దేశాలు ప్రయత్నాలు చేస్తున్న ప్రస్తుత సమయంలో అగ్రరాజ్యం అధ్యక్షుడు ట్రంప్ చేస్తున్న వ్యాఖ‍్యలు కీలకంగా మారాయి.
అప్పుడు కట్టడి కోసం పోరు.. ఇప్పుడు..
మరోవైపు భారత్ కూడా టీకా పంపిణీకి వడివడిగా అడుగులు వేస్తోంది. చకచకా ఏర్పాట్లు చేస్తోంది. ముందుగా ఎవరికి వ్యాక్సిన్ వేయాలనే దానిపై జాబితా రూపకల్పనలో అధికారులు మునిగారు. త్వరలోనే అది పూర్తయి వ్యాక్సిన్ వేసేందుకు అడుగులు పడుతున్నాయి. కరోనా మహమ్మారికి అంతానికి వ్యాక్సిన్లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రపంచవ్యాప్తంగా కసరత్తు ముమ్మరమవుతున్న తరుణంలో డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా వ్యాక్సిన్ మొదట తమ దేశానికే కావాలని ట్రంప్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన కీలక ఉత్తర్వులపై సంతకం చేయడం గమనార్హం. ఒకవైపు ప్రపంచవ్యాప్తంగా పలు వ్యాక్సిన్లు మార్కెట్లోకి అందుబాటులోకి రానున్నాయి. అమెరికాలో తయారైన వ్యాక్సిన్ అయినా, విదేశాల్లో తయారైనా వ్యాక్సిన్ తమకే మొదటి ప్రాధాన్యం అన్నట్టుగా కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేశారు ట్రంప్. కాగా టీకా విషయంలో అమెరికా ఇప్పటికే కొన్ని సంస్థలతో ఒప్పందాలు చేసుకుంది. సప్లై విధానం.. అమెరికన్లకు ప్రాధాన్యత తదితర అంశాలపై ఓ క్లారిటీకి రాగా.. ఇలాంటి సమయలో ట్రంప్ ఆదేశాలు న్యాయ కమీషన్ ముందు నిలబడతాయా లేదా అన్నది సందేహస్పదంగా మారింది. ఇక వ్యాక్సిన్ విషయంలో అమెరికా విధానాలు ఎంతమేరకు సఫలమవుతాయన్నది అనుమానంగా ఉంది. ఇప్పటికే ట్రంప్ ప్రభుత్వం 2021 ఫిబ్రవరిలోపు 10 కోట్ల మందికి, జూన్‌లోపు ప్రజలందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది.