డోనాల్డ్ ట్రంప్ అభిశంసన

“Make America Great Again” అన్న ప్రచారంతో 2016 లో జరిగిన
అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డోనాల్డ్ ట్రంప్ కొన్ని గంటల కిందట అభిశంసనకు
గురయ్యాడు.

కాంగ్రెస్‌ను
అడ్డుకోవడం
, ఉక్రెయిన్‌తో ఆయన వ్యవహారాలకు సంబంధించిన
అధికారాన్ని దుర్వినియోగం చేసినందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ప్రతినిధుల సభ (లోక్ సభ లాంటిది ) బుధవారం అభిశంసించింది.

అధ్యక్షుడి
రాజకీయ ప్రత్యర్థి మరియు
2020 అధ్యక్ష పదవి రేసులో ముందున్న మాజీ వైస్ ప్రెసిడెంట్ జో బిడెన్‌పై
దర్యాప్తును ప్రారంభించాలని ఉక్రెయిన్‌పై అధ్యక్షుడిపై ఒత్తిడి తెచ్చారని
ఆరోపించిన హౌస్ రెండు నెలల విచారణ తర్వాత బుధవారం అభిశంసనపై చారిత్రాత్మక ఓటింగ్
జరిగింది .

అభిశంసన కు కారణమైన
రెండు ప్రధాన ఆరోపణలు
,

మొదటిది, అధికార దుర్వినియోగం, తన రాజకీయ ప్రత్యర్థి , డెమొక్రాటిక్ నేత ,2020 అధ్యక్ష పదవి రేసులో ముందున్న జో బిడెన్‌పై దర్యాప్తుచెయ్యాలని ఉక్రెయిన్‌పై ఒత్తిడి తెచ్చేందుకు
ట్రంప్ చేసిన ఆరోపణల
;

రెండవది, కాంగ్రెస్ అధికారాన్ని ఆటంకపర్చటం ట్రంప్  అభిశంసన విచారణకు సహకరించడానికి నిరాకరించటం,తన ముఖ్య సహాయకులు సాక్ష్యాలు ఇవ్వకుండా అడ్డుకోవటం .

అభిశంసన, అధికార దుర్వినియోగం మీద జరిగిన ఓటింగ్ 
230-197 మరియు రెండవది
,
కాంగ్రెస్
అధికారాన్ని  ఆటంకపర్చటం  మీద జరిగిన ఓటింగ్  229-198 తో గెలిచాయి. దీనితో ట్రంప్ అభిశంసన
తీర్మానం గెలిచినట్లయింది.

అమెరికా చరిత్రలో
ఆండ్రూ జాన్సన్
(1865-1869) మరియు బిల్
క్లింటన్
(1993-2001) తరువాత
అభిశంసనకు గురైన మూడో అధ్యక్షుడు  డొనాల్డ్
ట్రంప్ .

అధ్యక్షుడి
అభిశంసనకు ప్రతినిధుల సభ 
ఆమోదం తెలపటంతో అభిశంసన మీద సెనేట్(రాజ్యసభ లాంటిది) విచారణ
జరుపుతుంది.సెనేట్ లో ట్రంప్ పార్టీ రిపబ్లిక్స్ కు బలం ఉండటం వలన అభిశంసన కు
సెనేట్ ఆమోదం లభించటం కష్టమే.

2016 ఎన్నికల్లో
ట్రంప్ గెలుపు మీద మొదటి నుంచి అనేక ఆరోపణలు వచ్చాయి. ఆయన పనితీరు మీద సొంత పార్టీ
నేతలే విమర్శలు చేశారు. యాదృచ్ఛికం కాకపోయినా ట్రంప్ గెలిచినా కొద్దీ రోజుల్లోనే
ఆయన పూర్తి కాలం పదవిలో ఉంటాడా
?అన్న చర్చ
జరిగింది.

Show comments