iDreamPost
android-app
ios-app

రవితేజ ఆ సినిమా చేయకుండా ఉండాల్సింది!

  • Published Dec 14, 2022 | 8:28 PM Updated Updated Dec 14, 2022 | 9:09 PM
  • Published Dec 14, 2022 | 8:28 PMUpdated Dec 14, 2022 | 9:09 PM
రవితేజ ఆ సినిమా చేయకుండా ఉండాల్సింది!

అభిమాన హీరో నటించిన సినిమా డిజాస్టర్ అయితే.. ఆ సినిమా తమ హీరో చేయకుండా ఉండాల్సింది అని ఫ్యాన్స్ అనుకోవడం సహజం. ఎందుకంటే ఆ సినిమా హీరో కెరీర్ లో మరిచిపోలేని గాయంగా మిగిలిపోతుంది. పైగా మిగతా హీరోల ఫ్యాన్స్ ట్రోల్ చేస్తారు. అందుకే ఆ డిజాస్టర్ తమ హీరో చేయకుండా ఉండాల్సింది అని అనుకుంటారు. కానీ మాస్ మహారాజా రవితేజ అభిమానుల బాధ మరోలా ఉంది. ఒక హిట్ సినిమాని రవితేజ ఎందుకు చేశాడా అని వాళ్ళు తెగ ఫీలయిపోతున్నారు.

రవితేజ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘రాజా ది గ్రేట్’. 2017 లో విడుదలైన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. బ్లైండ్ అయినా ఇంటెలిజెంట్ గా, ఎనర్జిటిక్ గా ఉండే క్యారెక్టర్ లో రవితేజ తనదైన శైలిలో నటించి మెప్పించాడు. ఆయన కామెడీ టైమింగ్ కి ఆడియెన్స్ ఫిదా అయ్యారు. అయితే ఆ సినిమా తర్వాత పలు సినిమాలు చేసినా.. అందులో పోషించిన రాజా పాత్ర నుంచి రవితేజ ఇప్పటికీ బయటకు రాలేకపోతున్నాడు అనిపిస్తోంది.

‘రాజా ది గ్రేట్’లో బ్లైండ్ పాత్ర పోషించిన రవితేజ.. తన చూపుని నిజంగానే ఒక అంధుడు చూస్తే ఎలా ఉంటుందో అలా ఉండేలా చేశాడు. ఆ సినిమా కోసం చాలా రోజులు షూటింగ్ లో పాల్గొన్న ఆయన.. కంటిచూపుని అంధుడిలా పెట్టీ పెట్టీ అదే అలవాటు అయినట్లుంది. ఆ తర్వాత ఆయన నటించిన సినిమాల్లోనూ పలు సన్నివేశాల్లో ఆయన చూపు.. ‘రాజా ది గ్రేట్’ సినిమాలోని పాత్రనే గుర్తు చేస్తోంది. ఆ బ్లైండ్ రోల్ కోసం కళ్ళను అలా ఎక్కువ రోజులు ఉంచడం వల్లనేమో ఇప్పటికీ కొన్ని సన్నివేశాల్లో ఆయన కంటిచూపు అలాగే కనిపిస్తోంది. తాజాగా ‘వాల్తేరు వీరయ్య’ నుంచి రవితేజ ఫస్ట్ లుక్ టీజర్ విడుదల కాగా.. అందులో కూడా రెండు షాట్స్ లో రవితేజ లుక్ అలాగే ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో సోషల్ మీడియాలో ఆ స్క్రీన్ షాట్స్ ని షేర్ చేస్తున్న రవితేజ ఫ్యాన్స్.. ఆ సినిమా చేయకుండా ఉండాల్సింది అన్న అని కామెంట్స్ చేస్తున్నారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibombetciograndpashabet