iDreamPost
android-app
ios-app

2022 రివ్యూ 3 – జాడలేని స్టార్లు డైరెక్టర్లు

  • Published Dec 22, 2022 | 5:09 PM Updated Updated Dec 22, 2022 | 5:09 PM
2022 రివ్యూ 3 – జాడలేని స్టార్లు డైరెక్టర్లు

లాక్ డౌన్ గొడవలు లేని సంపూర్ణ సంవత్సరంగా 2022 చక్కగా ముగుస్తోంది. చెప్పుకోదగ్గ విజయాలు, మార్కెట్ పరంగా పెరిగిన టాలీవుడ్ స్థాయి ఇవన్నీ శుభా సూచకంగా కనిపిస్తున్నాయి. అయితే ఈ ఏడాదిని మిస్ చేసుకున్న తారలు దర్శకులు ఉన్నారు. ఒకవేళ వీళ్ళ సినిమాలు కూడా వచ్చి ఉంటే ప్యాన్ ఇండియా రేంజ్ లో మరింత స్కోప్ పెరిగేది. వాళ్ళెవరో చూద్దాం. ఐకాన్ స్టార్ ‘అల్లు అర్జున్’ ఫ్యాన్స్ కి ఈసారి నిరాశ తప్పలేదు. ఒకవేళ పుష్ప 2 త్వరగా మొదలై షూటింగ్ పూర్తి చేసుకుని ఉంటే ఫస్ట్ పార్ట్ లాగా డిసెంబర్ లో వచ్చేదేమో కానీ స్క్రిప్ట్ ప్లస్ బడ్జెట్ అమాంతం పెరిగిపోవడంతో గ్యాప్ తప్పలేదు. సహజంగా ‘సుకుమార్’ కూడా ఈ ఇయర్ ని మిస్ చేసుకున్నారు

అల వైకుంఠపురములో ఇండస్ట్రీ హిట్ తర్వాత ‘త్రివిక్రమ్ శ్రీనివాస్’కు రెండేళ్లకు పైగా గ్యాప్ వచ్చేసింది. జూనియర్ ఎన్టీఆర్ ప్రాజెక్టు క్యాన్సిల్ కావడం, మహేష్ బాబుతో ప్లాన్ చేసుకున్నది రకరకాల కారణాల వాల్ల వాయిదా పడుతూ వచ్చి ఆఖరికి కథ మారే దాక వెళ్లడం కనిపించకుండా చేశాయి. అయితే రచయితగా భీమ్లా నాయక్ లో తన కలం మెరుపులు వినిపించడం ఒకటే అభిమానులకు ఊరట కలిగించింది. బాహుబలి తర్వాత బొత్తిగా నల్లపూసైన స్వీటీ ‘అనుష్క’ను చూసి ఎంత కాలమయ్యిందో. నిశ్శబ్దం ఓటిటి రిలీజ్ తర్వాత మళ్ళీ తన దర్శనం లేదు. నవీన్ పోలిశెట్టితో చేస్తున్న సినిమా వచ్చే ఏడాదికి ప్లాన్ చేశారు కాబట్టి ఇంకొంత కాలం ఆగాల్సిందే

పెళ్లి ఆ తర్వాత సంతానంతో ‘కాజల్ అగర్వాల్’ని తెరమీద చూడలేకపోయాం. ఆచార్యలో చేసినప్పటికీ షూట్ చేసిన పాత్రను కూడా తీసేయడంతో తనకో కౌంట్ మైనస్ అయ్యింది. యాక్సిడెంట్ తర్వాత కోలుకున్న ‘సాయి ధరమ్ తేజ్’ స్క్రీన్ మీద రాలేదు. ‘అఖిల్’ సమయం కష్టం మొత్తం ఏజెంట్ షూటింగ్ లోనే కరిగిపోయింది. ఈసారి వస్తాడేమో అని ఎదురు చూసిన అక్కినేని ఫ్యాన్స్ కి నిరాశ తప్పలేదు. ‘బెల్లకొండ సాయిశ్రీనివాస్’ ఛత్రపతి హిందీ రీమేక్ తప్ప వేరే ప్రపంచం లేకుండా ఉంటున్నాడు. గద్దలకొండ గణేష్ లాంటి సక్సెస్ ఫుల్ మూవీ తర్వాత దర్శకుడు ‘హరీష్ శంకర్’ పవన్ కోసం ఎదురు చూడాల్సి రావడంతో తనకూ 2022 అచ్చిరాలేదు.

Jojobet GirişMadridbetMariobetmeritbetmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet giriş