ట్రాన్స్ జెండర్ల పట్ల సమాజంలో ఎలాంటి భావన ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వారిని సమాజం చాలా చిన్న చూపుస్తుంది. అయితే కొందరి ట్రాన్స్ జెండర్లను వారి కుటుంబం సభ్యులే అర్ధం చేసుకోలేరు. దీంతో ఇంటి నుంచి బయటకు వచ్చిన… వాళ్ల నానా కష్టాలవు అనుభవిస్తుంటారు. అలానే ఓ హిజ్రను కూడా సమాజంతో పాటు తన కుటుంబం కూడా అర్ధం చేసుకోలేదు. ఎందరో హేళనలు చేశారు. చివరకు ప్రాణాలు తీసుకుందామని ఆమె భావించింది. చివరకు వైద్యురాలిగా మారి ప్రాణాలు పోస్తుంది. ఆమె ప్రాచీ రాథోడ్. మరి.. ఆమె స్టోరీ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రాచీ రాథోడ్ ట్రాన్స్ జెండర్ కావడంతో సమాజమే కాదు.., కుటుంబం కూడా తనను అర్థం చేసుకోలేదు. ఇంట్లోంచి బయటకు వచ్చి నానాకష్టాలు అనుభవించింది. ఆత్మహత్యాయత్నం కూడా చేసింది. కానీ, గేలి చేసే వారి ముందు ఇంకా హేళనైపోతాననుకుంది. తనను తాను అర్థం చేసుకుని…కష్టపడి చదివింది. ఇంటర్ తరువాత మెడికల్ సీటు సంపాదించింది. ఆదిలాబాద్ రిమ్స్ నుంటి వైద్య పట్టాను పొందింది. ఇప్పుడు ఉస్మానియా ఆస్పత్రిలో ఏఆర్‌టీ విభాగంలో డాక్టర్‌గా వైద్యసేవలందించే స్థాయికి ఎదిగింది ప్రాచీ రాథోడ్.
ఏడు నెలల క్రితం ఉస్మానియా ఆస్పత్రిలో విధుల్లో చేరింది. తాను ఇలా జనాల్లో కలిసి.. వారికి సేవలు చేస్తానని అనుకోలేదని ఆమె సంతోషం వ్యక్తం చేశారు. సమాజంలో అవమానాలు భరించలేక ఆత్మహత్యాయత్నంకి కూడా ప్రయత్నించానని తెలిపారు. తాను అందిస్తున్న సేవలకు గాను రోగులు ప్రశంసిస్తుంటే చాలా సంతోషంగా ఉందని ప్రాచీ రాథోడ్ తెలిపారు. వైద్య పట్టా అందుకోక ముందు తాను చాలా కష్టాలు అనుభవించానని తెలిపారు.
ఆమె ఇంకా మాట్లాడుతూ..” సమాజంలో వారు ఎలాంటి హేళన చేసిన కుటుంబ సభ్యుల మద్దతు ఉంటే.. ఆ బాధలను మర్చిపోయే వాళ్లం. అయితే ఇంటర్ కు వచ్చిన తరువాత హేళనలు ఇంకా ఎక్కువయ్యాయి. ఎంతలా అంటే అసలు నేను ఎందుకు బతకాలి. జీవించి ఉండి ఏమి లాభం అనే స్థితికి నేను వచ్చాను. ట్రాన్స్ జెండర్ అంటే కేవలం బెగ్గింగ్ కోసమే పుడతారా? అంటూ అనేక ప్రశ్నలు నాలో వచ్చాయి. ఈక్రమంలోనే ఇంటర్ లో ఉన్న సమయంలో ఆత్మహత్యయత్నం చేసుకున్నాను. సమాజంలో అవగాహన లేకపోవడం వలన రకరకాల పేర్లతో పిలవడం వంటి వాటితో చాలా ఇబ్బందిగా ఉండేది. ఎంబీబీఎస్ లో సీటు రావడం అనేది దేవుడు నాకు ఇచ్చిన బహుమతి.
ఆసమయంలోనే నేను ట్రాన్స్ జెండర్ అనే విషయాని తోటి విద్యార్థులకు, ప్రొఫెసర్స్ కి చెప్పాను. వాళ్లు కూడా నన్ను ఎంతో అభిమానంగా ఆదరించారు. ఒక చోట ఉద్యోగం చేసిన సమయంలో నేను ట్రాన్స్ జెండర్ అని తెలిసి.. ఉద్యోగం నుంచి తొలిగించారు. మిత్రి క్లినిక్ వెళ్లడం ద్వారా నా జీవితంలో మార్పులు చోటుచేసుకున్నాయి. అదే నా సెకండ్ లైఫ్ అని చెప్పొచ్చు. ప్రభుత్వం చొరవ తీసుకుంటే ఈ జెండర్ డిక్రిమినేషన్ అనేది తొలుగుతుంది” ప్రాచీ రాథోడ్ తెలిపారు. మరి.. ప్రాచీ రాథోడ్ లైఫ్ స్టోరీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.