P Venkatesh
P Venkatesh
రైలు ప్రయాణం చేసేవారు కొంతమంది రిజర్వేషన్ బోగీల్లో ప్రయణం చేస్తారు, మరికొందరు జనరల్ బోగీల్లో ప్రయాణిస్తారు. రిజర్వేషన్ లో ప్రయాణించే వారు ముందుగానే టికెట్ బుక్ చేసుకుని హ్యాపీగా జర్నీ చేస్తారు. ఇక అన్ రిజర్వడ్ లో ప్రయాణం చేసే వారు అప్పటికప్పుడు టికెట్ కౌంటర్ కు వెళ్లి క్యూలైన్లో నిలబడి టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఒక్కోసారి జనరల్ టికెట్ కోసం ప్రయాణికులు బారులు తీరడంతో ఈ లోగా ట్రైన్ వెళ్లి పోతుంది. ఈ క్రమంలో తమ ప్రయాణం క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఈ ఇబ్బందిని గుర్తించిన రైల్వే శాఖ ప్రయాణికులు జనరల్ టికెట్ ను ఆన్ లైన్ లోనే బుక్ చేసుకునే సౌలభ్యాన్ని కల్పిస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
రైలు ప్రయాణికులకు సౌత్ సెంట్రల్ రైల్వై గుడ్ న్యూస్ చెప్పింది. ట్రైన్ లో జనరల్ బోగీల్లో ప్రయాణం చేయాలనుకునే వారు టికెట్ల కోసం క్యూ లైన్లలో నిలబడి ఇబ్బంది పడాల్సిన పని లేదు. ఇకపై ఆన్ లైన్ లో జనరల్ టికెట్ బుక్ చేసుకోవచ్చు. దీని కోసం అన్ రిజర్వ్డ్ టికెటింగ్ సిస్టమ్ యాప్ (యూటీఎస్) ను అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్ ను ప్లే స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకుని జనరల్ టికెట్లను సులభంగా బుక్ చేసుకోవచ్చు. ఈ యూటీఎస్ యాప్ ద్వారా జనరల్ టికెట్లు, ఫ్లాట్ ఫారమ్ టికెట్లు కూడా బుక్ చేసుకోవడానికి దక్షిణ మధ్య రైల్వే అవకాశం కల్పించింది. అయితే ప్రయాణికులు వారు ప్రయాణం చేసే రోజు మాత్రమే జనరల్ టికెట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.
జనరల్ టికెట్ ఇలా బుక్ చేసుకోవాలి
-ముందుగా మీ స్మార్ట్ ఫోన్లో ప్లే స్టోర్ నుండి UTS యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి.
-యాప్ ఇన్‌స్టాలేషన్ తర్వాత మీరు మీ వ్యక్తిగత వివరాలను పేరు, ఫోన్ నెంబర్, పాస్ వర్డ్ వంటి వివరాలు నమోదు చేయాలి.
-ఆ తర్వాత రిజిస్టర్ మొబైల్ నెంబర్ కు ఓటీపీ వస్తుంది. ఈ ఓటీపీ ఎంటర్ చేస్తే యూటీఎస్ యాప్ లో మన అకౌంట్ రిజిస్టర్ అవుతుంది.
-యాప్ ఓపెన్ చేసి ఫోన్ నెంబర్, పాస్ వర్డ్ తో లాగిన్ కావాలి.
-యాప్ లో జనరల్ టికెట్లు, ఫ్లాట్ ఫారమ్ టికెట్ల కేటగిరీలు కనిపిస్తాయి.
-ప్రయాణం ప్రారంభించే స్టేషన్, ఎక్కడి వరకు ప్రయాణిస్తున్నామో ఆ స్టేషన్ వివరాలు నమోదు చేసుకోవాలి.
-క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, డిజిటల్ పేమెంట్స్ ద్వారా టికెట్లను బుక్ చేసుకోవచ్చు.
-షో టికెట్ ఆప్షన్ ను క్లిక్ చేస్తే బుకింగ్ కు సంబంధించిన వివరాలన్నీ కనిపిస్తాయి. జనరల్ టికెట్ ను డౌన్ లోడ్ చేసుకుని చెకింగ్ అప్పుడు టీసీకి చూపించొచ్చు.