Uppula Naresh
Uppula Naresh
 
        
మహబూబ్ నగర్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. బీటెక్ సెకండియర్ చదువుతున్న శ్రీవాణి అనే యువతి బలవన్మరణానికి పాల్పడింది. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. అయితే ఉన్నట్టుండి కూతురు ఇలా చేయడంతో మృతురాలి తండ్రి గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు. ఇదే ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. అసలేం జరిగిందంటే?
కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. మహబూబ్ నగర్ పట్టణానికి చెందిన శ్రీవాణి (19) అనే యువతి మేడ్చల్ లోని ఓ ప్రముఖ కాలేజీలో బీటెక్ సెకండియర్ చదువుతోంది. ఈ అమ్మాయి ఇక్కడే హాస్టల్ ఉంటూ కాలేజీకి వెళ్లేది. అయితే ఈ యువతి ఇటీవలే ఇంటికి వచ్చి సోమవారం తిరిగి హాస్టల్ కు వెళ్లింది. కాగా, బుధవారం హాస్టల్ ఎవరూ లేని సమయంలో శ్రీవాణి గదిలో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న తోటి స్నేహితులు వెంటనే హాస్టల్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో కాలేజీ యాజమాన్యానికి తెలియజేశారు.
దీంతో అందరూ హుటాహుటిన హాస్టల్ కు చేరుకుని ఆ యువతి మృతదేహాన్ని చూసి షాక్ గురయ్యారు. కూతురు మరణవార్తను ఆమె తండ్రికి తెలియజేయడంతో అతడు హాస్టల్ కు చేరుకున్నాడు. ఆ తర్వాత కూతురుని ఆ స్థితిలో చూసి కన్నీరు మున్నీరుగా విలపించాడు. శ్రీవాణి మరణవార్త తెలియడంతో ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు శోక సంద్రంలో మునిగిపోయారు. అయితే శ్రీవాణి ఆత్మహత్యకు గల కారణం తెలియాల్సి ఉంది. మరో బాధాకరమైన విషయం ఏంటంటే ఇటీవల కాలంలోనే శ్రీవాణి అక్క, అమ్మ మరణించినట్లు తెలుస్తోంది. ఈ ఘటన మరువకముందే ఈ యువతి బలవన్మరణానికి పాల్పడడంతో స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.
ఇది కూడా చదవండి: యూట్యూబ్‌లో చూసి భార్యకు డెలివరీ.. చివరకు విషాదంగా..
