బీజేపీకి మరో షాక్.. మాజీ ఎంపి వివేకతో రేవంత్ భేటీ!

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా మారిపోతున్నాయి. ముఖ్యంగా అసంతృప్తి నేతలు ప్రత్యర్థి పార్టీ కండువ కప్పుకుంటున్నారు.

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా మారిపోతున్నాయి. ముఖ్యంగా అసంతృప్తి నేతలు ప్రత్యర్థి పార్టీ కండువ కప్పుకుంటున్నారు.

తెలంగాణలో ఎన్నికలు దగ్గరపడుతున్నా కొద్ది ప్రధాన పార్టీల్లో అసంతృప్తులు పెరిగిపోతున్నాయి. ఆశించిన సీట్లు దక్కకపోవడంతో మరో పార్టీ కండువా కప్పుకోవడానికి రెడీ అవుతున్నారు. గత ఏడాది బీజేపీలోకి భారీగా వలసలు, చేరికలు సాగాయి. కానీ ఇప్పుడు ఎన్నికల వేల కాంగ్రెస్ ఆకర్ష్ నడుస్తుంది. పెద్ద తలకాయలే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటున్నారు. బీఆర్ఎస్, బీజేపీ నుంచి అసంతృప్తి నేతలు కాంగ్రెస్ లోకి వచ్చేస్తున్నారు. తాజాగా బీజేపీ మాజీ ఎంపీ వివేక తో రాత్రి రేవంత్ రెడ్డి భేటీ కావడం సెన్సెషన్ న్యూస్ అయ్యింది. వివరాల్లోకి వెళితే..

తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది రాజకీయ సమీకరణాలు అనూహ్యంగా మారిపోతున్నాయి. ఎవరు ఏ పార్టీలో చేరుతారో తెలియని అయోమయం నెలకొంది. ఈసారి ఎన్నికల్లో అధికార పార్టీని ఎలాగైనా ఓడించాలని కాంగ్రెస్ గట్టి పట్టుమీదే ఉంది. అందుకు సీనియర్ నేతలను తమ పార్టీలోకి ఆహ్వానిస్తూ బలం పెంచుకుంటుంది. ఇప్పటికే బీజేపీ, బీఆర్ఎస్ అసంతృప్తి నేతలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. కొత్తగా చేరిన వారికి పార్టీ టికెట్ కూడా కేటాయిస్తున్నారు. తాజాగా రేవంత్ రెడ్డి, మాజీ ఎంపీ వివేక్‌ వెంకటస్వామితో భేటీ అయ్యారు. ఈ భేటీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

మొన్నటి వరకు మాజీ ఎంపీ వివేక తాను ఎట్టి పరిస్థితుల్లో పార్టీ మారే ముచ్చటే లేదని అన్నారు. ఈ నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలో వివేక్ ఫామ్ హౌజ్ లో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వెళ్లి కలిశారు. గంటన్నరపాటు ఇరువురు ప్రస్తుతం రాజకీయాలపై చర్చలు జరిపినట్లు సమాచారం. ఈ సందర్భంగా తెలంగాణలో కాంగ్రెస్ గెలవాలంటే బలమైన నాయకులు పార్టీలో చేరాలని కోరినట్లు సమాచారం. ఈ క్రమంలో వివేక త్వరలో కాంగ్రెస్ లో చేరుతారని ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ లో చేరిన విషయం తెలిసిందే.

Show comments