iDreamPost
iDreamPost
టాలీవుడ్ సమస్యలన్నింటికి పరిష్కరించడానికి, ఆగస్ట్ 1 నుంచి షూటింగ్ లను నిలిపివేయాలని ప్రొడ్యూసర్స్ గిల్డ్ నిర్ణయం తీసుకుంది. అన్నపూర్ణా స్డూడియోస్ లో గిల్డ్ సమావేశానికి టాలీవుడ్ లోని టాప్ ప్రొడ్యూసర్లు అందరూ వచ్చారు. ఇండస్ట్రీ సమస్యలపై చర్చించారు. నిర్మాతల మండలి తీసుకున్న సంచలన నిర్ణయాలు, బడ్జెట్ పరిమితులతోపాటు ఓటీటీ విడుదలపైనా గంటసేపు మాట్లాడుకున్నారు.
అన్ని సమస్యలను పరిష్కరించడానికి వీలుగా ఆగస్ట్ 1 నుంచి సినిమా షూటింగ్ లను నిలివేయాలనుకున్నారు. ఆ తర్వాత సమస్యలన్నింటిని చర్చించాలని, ఆ తర్వాత తగిన నిర్ణయాలు తీసుకోవాలని తీర్మానించారు.
ఆగస్ట్ 1 నుంచి సినిమా షూటింగ్ లు బంద్ అంటే, అగ్రహీరోల సినిమాలపై ప్రభావం పడనుంది. చిరంజీవి సినిమాలు షూటింగ్ లో ఉన్నాయి. పవన్ కళ్యాన్ హరిహర వీరమల్లు షూటింగ్ ఎప్పుడో ఎవరికీ తెలియదు. ఇక బాలయ్య 107వ సినిమా మాత్రం ఫుల్ స్వింగ్ లో ఉంది. ఆమేరకు ఇబ్బంది తప్పదు. ప్రభాస్ ప్రాజెక్ట కె, రవితేజ రావణాసుర, రామ్ చరణ్-శంకర్ చిత్రంతోపాటు వంశీపైడిపల్లి-విజయ్ ల సినిమా షూటింగ్ లు కొన్ని వారాలు ఆగిపోవచ్చు.
సమస్యలను పరిష్కరించాలంటే నిర్మాతలందరూ కలసి కుర్చోవాలి. కాని షూటింగ్స్ ఉన్నాయని చాలామంది రావడంలేదు. షూటింగ్స్ బంద్ చేస్తే అందరూ వస్తారు. చర్చలకి సమయం కేటాయిస్తే అన్నీ ఒక కొలిక్కివచ్చే అవకాశం ఉందన్నది గిల్డ్ భావన.
ఓటీటీను ఎలా ఎదుర్కోవాలో ఇంకా టాలీవుడ్ కి అర్ధంకావడంలేదు. టిక్కెట్ రేట్లు ఎక్కువగా ఉన్నాయి. సినిమాకో రేటు పెట్టడం వల్ల తికమకలతో ఆడియన్స్ ఇబ్బందిపడుతున్నారు. వీన్నంటినీ పరిష్కరించాలన్నది గిల్ట్ ఉద్దేశం. అందుకే షూటింగ్స్ బంద్.