iDreamPost
android-app
ios-app

Tollywood : నెల రోజుల తర్వాత టాలీవుడ్ సందడి

  • Published Feb 08, 2022 | 5:39 AM Updated Updated Feb 08, 2022 | 5:39 AM
Tollywood : నెల రోజుల తర్వాత టాలీవుడ్ సందడి

సుమారు నెల రోజుల తర్వాత బాక్సాఫీస్ వద్ద మళ్ళీ సందడి కనిపించనుంది. బంగార్రాజు తర్వాత ఒక్కటంటే ఒక్కటీ కనీస స్థాయిలో మెప్పించే సినిమా లేకపోవడంతో ఈ నెల 11, 12న రాబోయే కొత్త చిత్రాల కోసం మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అందరి కళ్ళు ఎక్కువగా ఉన్నది రవితేజ ఖిలాడీ పైనే. నిన్న రిలీజైన ట్రైలర్ వావ్ అనిపించకపోయినా అభిమానుల వరకు సంతృప్తిని కలిగించింది. వీడియో కట్ సరిగా చేయలేదనే కామెంట్స్ ఉన్నాయి. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, హీరోయిన్ల గ్లామర్, అనసూయ అర్జున్ లాంటి క్యాస్టింగ్ లాంటి ఆకర్షణలను సరిగా ప్రమోట్ చేయడం లేదని మాస్ మహారాజా ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

తక్కువ బడ్జెట్ తో పెద్ద బ్యానర్ లో రూపొందిన డిజె టిల్లు(12) యూత్ ని బాగానే ఆకట్టుకుంటోంది. దానికి జరిగిన బిజినెస్ కి యావరేజ్ టాక్ వచ్చినా చాలు ఈజీగా లాభాలు మూటగట్టుకోవచ్చు. ప్రమోషన్లు కూడా రీచ్ అవుతున్నాయి. తమిళ డబ్బింగ్ ఎఫ్ఐఆర్ కూడా పోటీలో ఉంది కానీ దీనికి పెద్దగా హైప్ లేదు. రవితేజ సమర్పకుడిగా ఉన్న విషయాన్ని హై లైట్ చేస్తున్నారు కానీ ఆయనదే ఖిలాడీ ఉన్నప్పుడు అభిమానులు దీనికి అంత ప్రాధాన్యం ఇస్తారని అనుకోలేం. పూర్తిగా టాక్ మీద ఆధారపడాల్సిందే. వీటి మధ్యలో చిన్న సినిమా సెహరి అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఇది కూడా యూత్ ఫుల్ ఎంటర్ టైనరే కానీ జనాల రెస్పాన్స్ చూడాలి.

సో మొత్తంగా నెంబర్ అయితే బాగుంది కానీ మునుపటి జోష్ తెచ్చే సినిమా ఏదో చూడాలి. డిసెంబర్ లో వచ్చిన అఖండ, పుష్ప రేంజ్ లో ఏ సినిమా ఇప్పటిదాకా మేజిక్ చేయలేదు. బంగార్రాజు హిట్టే కానీ కాంపిటీషనే లేని ట్రెండ్ లోనూ పెద్దగా అద్భుతాలు చేయలేకపోయింది. రెండు వారాల తర్వాత వీకెండ్ హౌస్ ఫుల్స్ తో నెట్టుకొచ్చినప్పటికీ ఇంకొంచెం ఎక్కువ స్థాయికి చేరుకొని ఉంటే బాగుండేది. కొత్త ఏడాదిలో 40 రోజులు దాటాక కూడా థియేటర్లు పూర్తిగా కళకళలాడకపోవడం సినిమా ప్రేమికులను బాధ పెడుతోంది. మరి ఖిలాడీతో పాటు మిగిలిన మూడు సినిమాల్లో ఎవరు హౌస్ ఫుల్ బోర్డులు వేసుకుంటారో చూడాలి

Also Read : Khiladi Trailer : రవితేజ మార్కు కమర్షియల్ మసాలా