Keerthi
Ajay Ghosh: తాజాగా నటుడు అజయ్ ఘోష్, హీరోయిన్ చాందినీ చౌదరి ప్రధాన పాత్రలో మ్యూజిక్ షాప్ మూర్తి అనే సినిమాలో నటించారు. ఈ క్రమంలోనే ఆ సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ తాజాగా నిర్వహించారు. ఇక ఈ ఈవెంట్ లో నటుడు అజయ్ ఘోష్ మూవీ తన నంబర్ ఇచ్చి మూవీ నచ్చకపోతే కాల్ చేయండి అంటూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Ajay Ghosh: తాజాగా నటుడు అజయ్ ఘోష్, హీరోయిన్ చాందినీ చౌదరి ప్రధాన పాత్రలో మ్యూజిక్ షాప్ మూర్తి అనే సినిమాలో నటించారు. ఈ క్రమంలోనే ఆ సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ తాజాగా నిర్వహించారు. ఇక ఈ ఈవెంట్ లో నటుడు అజయ్ ఘోష్ మూవీ తన నంబర్ ఇచ్చి మూవీ నచ్చకపోతే కాల్ చేయండి అంటూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Keerthi
నటుడు అజయ్ ఘోష్.. ఈపేరు చెప్పగానే గుర్తుపట్టాడం కష్టం. కానీ, పుష్ప సినిమా విలన్ కొండరెడ్డి అంటే మాత్రం అందరూ టక్కున గుర్తుపట్టేస్తారు. అంతలా ఆ సినిమాలో తన నటనతో ప్రేక్షకులకు గుర్తేండిపోయాడు ఈ నటుడు. ఇకపోతే ఈయన మొదటిగా ప్రస్థానం అనే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు దగ్గరయ్యాడు. ఇక ఈ సినిమాలో తన నటనతో ప్రేక్షకుల దగ్గర మంచి మార్కులు వేసుకున్న అజయ్ ఘోష్ కు.. ఆ తర్వాత కాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస అవకాశాలు అందుకున్నాడు. ఈ క్రమంలోనే ఎన్నో చిత్రాల్లో సైడ్ క్యారెక్టర్లు కమెడియన్ విలన్ గా రోల్స్ ను పోషించి మంచి ఫేమ్ ను సంపాదించుకున్నాడు. ఇక ఈయన తెలుగుతో పాటు మరొపక్క తమిళ్, కన్నడ వంటి భాషల్లో కూడా నటిస్తూ బిజీ యాక్టర్ గా మారాడు.
ఇదిలా ఉంటే.. తాజాగా అజయ్ ఘోష్, హీరోయిన్ చాందినీ చౌదరి ప్రధాన పాత్రలో ‘మ్యూజిక్ షాప్ మూర్తి’ అనే సినిమాలో నటించారు. కాగా, ఆ సినిమా రేపు అనగా జూన్ 14వ తేదీ శుక్రవారం థియేటర్లలో విడుదల కానుంది. అయితే ఈ సినిమాను దర్శకుడు శివ పాలడుగు తెరకెక్కించనున్నారు. అలాగే హర్ష గారపాటి, రంగారావు గారపాటి సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్, పాటలు, పోస్టర్స్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశాయి. అలాగే కొద్ది రోజుల క్రితం విడుదలైైన ట్రైలర్ కు కూడా మంచి టాక్ వచ్చింది.అయితే తాజాగా మ్యూజిక్ షాప్ మూర్తి సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది.
ఇక ఈవెంట్ లో నటుడు అజయ్ ఘోష్ ఈ సినిమా గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘మ్యూజిక్ షాప్ మూర్తి ఒక చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వస్తుంది.అయితే ఈ సినిమా అందరికీ తప్పకుండా నచ్చుుతంది. అలాగే కుటుంబ సమేతంగా ఈ సినిమాను మీరు చూడవచ్చు అని ఆయన పేర్కొన్నారు. ఇక ఈ సినిమా అందరూ చూడండి.. నచ్చకపోతే తనకు ఫోన్ చేయండి, చేసి బూతులు తిట్టవద్దని’ చెబుతూ తన నంబర్ కూడా ఇచ్చేశాడు.
దీంతో మ్యూజిక్ షాప్ మూర్తి సినిమాపై అజయ్ ఘోష్ ఎంతటి అంచనాలు పెట్టుకున్నాడో తెలుస్తోందని నెటజన్లు అంటున్నారు.ఇక ఈ చిత్రంలో ప్రధాన పాత్ర అజయ్ ఘోష్‌దే కావడం విషేశం. ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. పాతికేళ్ల వయసులో సాధించలేనిది.. యాభై ఏళ్ల వయసు వచ్చాక సాధించాలనుకుంటే.. ఆ సాధన కోసం చేసే ప్రయత్నం ఎలా ఉంటుంది..? ఎంత ఎమోషనల్‌గా ఉంటుందనే కాన్సేప్ట్ తో ఈ మూవీని దర్శకుడు తెరకెక్కించారు.