iDreamPost
android-app
ios-app

హోటల్లో వెయిటర్‌.. ఐఏఎస్ ఆఫీసర్ అయ్యారు!

హోటల్లో వెయిటర్‌.. ఐఏఎస్ ఆఫీసర్ అయ్యారు!

పట్టుదల ఉంటే సాధించలేనిది అంటూ ఏమి లేదు. అలానే విజయం సాధించాలంటే ఆత్మవిశ్వాసం ఎంతో అవసరం. అది లేనిదే ఏమీ సాధించలేము. కనీసం ముందడుగేసే ధైర్యం కూడా  చేయలేము.  లక్ష్యాన్ని సాధించి తీరుతాం అనే ఆత్మవిశ్వాసం కూడా కలిగి ఉండాలి. ముఖ్యంగా యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ వంటి పోటీ పరీక్షల విషయంలో ఆత్మస్థైర్యం అనేది మరింత అవసరం. క్రమశిక్షణ, చేసే పనిపై నిబద్ధత, ఏకాగ్రతలు కూడ ఎంతో అవసరం. ఈ లక్షణాలను కలిగిన వారు.. కూలిగా ఉన్న సరే కుబేరుడిగా మారుతాడు. వెయిటర్ నుంచి ఐఏఎస్ ఆఫీసర్ స్థాయికి ఎదిగిన జయ గణేష్ కూడా ఆ కోవకు చెందిన వ్యక్తే. మరి.. జయ గణేష్ సక్సెస్ స్టరీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

తమిళనాడు ఉత్తర అంబర్ సమీపంలో ఉన్న ఒక చిన్న గ్రామమంలో జయ గణేష్ పుట్టారు. నలుగురు తోబుట్టువులలో పెద్దవాడైన గణేష్ చిన్నప్పటి నుంచే చాలా తెలివితేటలు కలిగి ఉండేవాడు. సొంతూరిలోనే గణేష్ తన ప్రాథమిక విద్యాని పూర్తి చేశాడు. 12వ తరగతిలో 91 శాతం మార్కులతో ఫస్ట్ క్లాస్ లో పాసయ్యాడు. థాంథై పెరియార్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో సీటు సంపాదించి.. మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తిచేశారు. ఇంజినీరింగ్‌  పట్టా పొందిన తరువాత జయ గణేష్‌ ఒక ఉద్యోగంలో చేరారు. ఆసమయంలో గణేష్ జీతం 2500. అయితే, ఆ జీతంతో తన కుటుంబాన్ని పోషించడం కుదరదని భావించి…సివిల్స్ పై దృష్టి సారించారు.

ఆరు సార్లు ప్రయత్నించిన జయ గణేష్ విజయం సాధించలేదు. కొన్నిసార్లు ప్రిలీమ్స్‌లో పోతే ఇంకొన్నిసార్లు మెయిన్స్‌లో పోయింది. ఇక జయ గణేష్ ఎంతో నిరుత్సాహ పడ్డాడు. ఒకవైపు ఆర్థిక ఇబ్బందులు.. మరోవైపు లక్ష్యాన్ని చేరుకోవాలన్న తపనతో గణేష్ నరకం అనుభవించారు. అన్ని ఇబ్బందులో కూడా భరిస్తూనే సివిల్స్ లక్ష్యంపై ఉన్న కోరికను మాత్రం వద్దలేదు. ఇంటికి పెద్దోడు కావడంతో కుటుంబం పోషణ చూసుకోవాల్సిన అవసరం అతడిపై ఉంది. దీంతో హోటల్ వెయిటర్‌గా పనిచేయడం ప్రారంభించారు. అలా వెయిటర్ గా చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తూనే తనకు దొరికిన  ప్రతి నిమిషాన్ని ఉపయోగించుకుని సివిల్స్ కి సిద్ధమయ్యారు. ఇదే సమంయలోజయ గణేష్ ఒకసారి ఇంటెలిజెన్స్ బ్యూరో  ఉద్యోగం సాధించారు.

అయితే అతడు ఉద్యోగంలో చేరాలా లేక ఏడవసారి సివిల్ సర్వీసెస్ పరీక్షకు ప్రయత్నించాలా ? అనే సందేహంలో పడ్డారు. ఒకవేళ ఈ ఉద్యోగం వదులుకుని ఐఏఎస్ కి ప్రిపేర్ అవుతే.. అందులో విజయం సాధించకపోతే ఉన్న ఉద్యోగం పోతుంది అనే భయం పట్టుకుంది. చివరకు ఏదేమైనా సరే తను అనుకున్నది సాధించాలి అనే కసితో ఐఏఎస్ అధికారి కావాలన్న తన కోరిక తొలి ప్రాధాన్యత ఇచ్చాడు. తన ఏడో ప్రయత్నంలో, జయ గణేష్ చివరకు సివిల్స్‌లో విజయం సాధించారు. జయ గణేష్ సాధించిన ఆలిండియా 156వ ర్యాంకు.. ఆయన కష్టానికి, పట్టుదలకి నిదర్శనంగా నిలిచింది. అలా నాడు హోటల్లో వెయిటర్ గా పని చేసిన గణేష్.. నేడు ఐఏఎస్ అధికారిగా మారి.. యువతకు ఆదర్శంగా నిలిచారు.  మరి.. జయ గణేష్ సక్సేస్ స్టోరీపై మీ అభిప్రాయం కామెట్స్ రూపంలో తెలియజేయండి.