iDreamPost
android-app
ios-app

అనుమానాస్పద స్థితిలో సంగారెడ్డి అదనపు కలెక్టర్‌ క్యాంప్ క్లర్క్ మృతి

  • Published Oct 29, 2023 | 3:15 PM Updated Updated Oct 29, 2023 | 3:15 PM

ఈ మద్య కాలంలో చాలా మంది ప్రతీ చిన్న విషయానికి చికాకు చేసుకోవడం, మనస్థాపానికి గురి కావడం జరుగుతుంది.

ఈ మద్య కాలంలో చాలా మంది ప్రతీ చిన్న విషయానికి చికాకు చేసుకోవడం, మనస్థాపానికి గురి కావడం జరుగుతుంది.

అనుమానాస్పద స్థితిలో సంగారెడ్డి అదనపు కలెక్టర్‌ క్యాంప్ క్లర్క్ మృతి

ఇటీవల చాలా మంది ప్రతి చిన్న విషయానికే మనస్థాపానికి గురై ఆత్మహత్యలకు పాల్పపడుతున్నారు. కొంతమంది క్షణికావేశానికి గురై ఎదుటి వారిపై దాడులకు పాల్పపడుతున్నారు. ఉన్నత చదువులు చదివిన వారు సైతం కొన్ని ఇబ్బందుల కారణంగా డిప్రేషన్ లోకి వెళ్లి బలవన్మరణాలకు పాల్పపడుతున్నారు. ఎక్కువగా పని ఒత్తిడి, ప్రేమ వ్యవహారాలు, ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఇలాంటి సంఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయని అధికారులు అంటున్నారు. తాజాగా సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ సీసీ అనుమానాస్పద స్థితిలో మరణించడం తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే..

సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ మాధురి వద్ద కొంతకాలంగా సీసీగా పనిచేస్తున్న గడిల విష్ణువర్థన్ (44) అనుమానాస్పద స్థితిలో కన్నుమూసినట్లు ఆదివారం పోలీసలు గుర్తించారు. కొండాపూర్ మండలం వద్ద ఉన్న ఓ టౌన్ షిప్ వద్ద కాలి ఉన్న మృతదేహం కనిపించింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించగా అది విష్ణువర్ధన్ అని గుర్తించారు. విష్ణు వర్థన్ కి భార్య శివకృష్ణ కుమారి, కుమార్తె వైష్ణవి , కుమారుడు హర్షవర్థన్ ఉన్నారు.

శనివారం రాత్రి భార్య శివకృష్న కుమారి.. విష్ణు వర్ధన్ కి ఫోన్ చేసి మాట్లాడినట్లు సమాచారం. గత కొంత కాలంగా విష్టు వర్ధన్ అనారోగ్య కారణాలతో బాధపడుతున్నారని.. నెల రోజులోగా సెలవుపై ఇంట్లో ఉంటున్నట్లు సమాచారం. శనివారం మధ్నాహ్నం ఇంటి నుంచి బయటికి వెళ్లిన ఆయన మళ్లీ రాలేదు. ఫోన్ కాంటాక్ట్ కూడా కాలేదని కుటుంబ సభ్యులు కన్నీరు పెట్టుకుంటున్నారు. అయితే విష్ణు వర్ధన్ ది హత్యా? ఆత్మహత్యా? కుటుంబ కలహాలు ఏమైనా ఉన్నాయా? అన్న కోణంలో పోటీసలు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.