iDreamPost
android-app
ios-app

ఘోర రోడ్డు ప్రమాదం.. బైక్ లపైకి దూసుకెళ్లిన లారీ!

ఘోర రోడ్డు ప్రమాదం.. బైక్ లపైకి దూసుకెళ్లిన  లారీ!

నిత్యం ఏదో ఒక ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. అతివేగం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం, మద్యం తాగి వాహనం నడపడం వంటి కారణాలతో ఈ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ రోడ్డు ప్రమాదాల కారణంగా ఎందరో అమాయకులు బలవుతున్నారు. కొందరు నిర్లక్ష్యానికి ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. అలానే ఎందరో తీవ్రగాయాలతో జీవితాన్ని నరకంగా అనుభవిస్తున్నారు. తాజాగా తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.  బైక్ లపైకి లారీ దూసుకెళ్లడంతో .. ఆరుగురు మృతి చెందారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే…

తమిళనాడు రాష్ట్రంలోని చెంగల్పట్టు జిల్లాలో పోతేరి గ్రామం సమీపంలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ లారీ అదుపుతప్పి.. రోడ్డు దాటుతున్న మూడు బైక్ ల పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ప్రమాదంలో మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా నుజ్జు నుజ్జుయ్యాయి. భారీ శబ్ధం రావడంతో స్థానికులు పెద్ద సంఖ్యలో సంఘటన స్థలానికి  చేరుకున్నారు. ఈ క్రమంలో కాసేపు భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. అక్కడ గుమ్మిగూడిన జనాలను చెదరగొట్టి..ట్రాఫిక్ క్లియర్ చేశారు.

మృతదేహాలను స్వాదీనం చేసుకుని.. పోస్టు మార్టం నిమిత్తం చెంగల్పట్టు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అలాగే ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మూడు బైక్ లను ఢీకొట్టిన అనంతరం లారీ..బారికేడ్ ను ఢీకొట్టిందని పోలీసులు తెలిపారు. నుజ్జు నుజ్జు అయినా మృతదేహాలతో సంఘటన స్థలం భయానకంగా మారింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుల కుటుంబాల రోదనలను ఆపడం అక్కడ ఉన్న ఎవరి తరం కాలేదు. మరి.. ఇలాంటి ఘటన నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: BJP నేత దారుణ హత్య.. బైక్ పై వచ్చి కాల్పులు

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş