ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది మధురమైన వేడుక. అందుకే ప్రతి ఒక్కరు తమ పెళ్లిని ఎంతో ఘనంగా నిర్వహించుకోవాలని భావిస్తుంటారు. అలానే ఎందరో యువత తమ వివాహాలను ఘనంగా నిర్వహించుకుంటారు. అయితే కొన్ని పెళ్లి వేడుకల్లో మాత్రం విషాదాలు చోటుచేసుకుంటాయి. అప్పటి వరకు సందడిగా ఉండే పెళ్లి ఇంట.. విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఓ ప్రాంతంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పెళ్లి ముంగించుకుని తిరుగు ప్రయాణమైన వారు… ఘోర ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో 103 మంది మరణించారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే…
ఉత్తర నైజీరియాలోని ఓ ప్రాంతంలో పెళ్లి వేడుక జరిగింది. ఈ వేడుకకు హాజరైన కొందరు తిరిగి తమ సొంత గ్రామాలకు బయలు దేరారు. అయితే వీరందరు పడవ ద్వారా సోమవారం తెల్లవారు జామున …వారి స్వగ్రామాలకు బయలు దేరారు. సుమారు తెల్లవారు జామున 3.30 గంటల సమయంలో నైగర్ నదిలో వీరు ప్రయాణిస్తున్న పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో దాదాపు 103 మంది మరణించారని సమాచారం. గల్లైంతన వారి కోసం గాలిస్తున్నట్లు స్థానిక పోలీసులు మంగళవారం తెలిపారు. ఉత్తర నైజీరియాలోని క్వారా రాష్ట్రంలో ప్రమాదం జరిగింది.
చీకట్లో ఘోర ప్రమాదం చోటుచేసుకోవడంతో తెల్లారేదాకా ఎవరికీ తెలియలేదు. సమాచారం అందుకున్న పోలీసులు, స్థానిక రెస్క్యూ టీమ్ సహయక చర్యలు చేపట్టింది. కొందరిని స్థానికి ఆస్పత్రులకు తరలించి.. చికిత్స అందిస్తున్నారు. నైజీరియా ప్రాంతంలో ఇటువంటి ప్రమాదాలు సర్వసాధారణంగా మారుతున్నాయి. స్థానికంగా తయారైన పడవలను ఉపయోగించడం వలనే ఈ ప్రమాదాలు జరుగుతున్నట్లు స్థానిక మీడియా తెలిపింది. పెళ్లి జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే ఈ ఘోర ఘటన చోటుచేసుకుంది. ఇలాంటి ఘటనలు జరగకుండా స్థానిక ప్రభుత్వంలు కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు భావిస్తున్నారు.