iDreamPost
android-app
ios-app

దిగొస్తున్న బంగారం ధరలు.. నేడు తులం ఎంతంటే?

  • Published May 25, 2024 | 7:52 AM Updated Updated May 25, 2024 | 7:52 AM

బంగారం కొనలనుకొనే పసిడి ప్రియులకు అదిరిపోయే శుభవార్త అందింది. వరుసగా గత మూడు రోజుల నుంచి బంగారం ధరలు క్రమంగా కుప్పకూలుతున్నాయి. కాగా, నేడు మార్కెట్‌ లో బంగారం ధర ఎంతంటే..

బంగారం కొనలనుకొనే పసిడి ప్రియులకు అదిరిపోయే శుభవార్త అందింది. వరుసగా గత మూడు రోజుల నుంచి బంగారం ధరలు క్రమంగా కుప్పకూలుతున్నాయి. కాగా, నేడు మార్కెట్‌ లో బంగారం ధర ఎంతంటే..

  • Published May 25, 2024 | 7:52 AMUpdated May 25, 2024 | 7:52 AM
దిగొస్తున్న బంగారం ధరలు.. నేడు తులం ఎంతంటే?

గత కొన్ని రోజులుగా బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా రోజురోజుకు బంగారం ధర, డిమాండ్‌  రికార్డు స్థాయికి చేరుకున్నాయి. దీంతో బంగారం కొనుగోలు చేయలనుకునే పసిడి ప్రియులకు వెనుకడుగు వేసేలా చుక్కలు చూపిస్తున్నాయి.  అయితే, గడిచిన మూడు రోజుల నుంచి బంగారం ధర తగ్గదడంతో  కాస్త ఊరటనిచ్చింది. ఇలాంటి సమయంలో బంగారం కొనుగోలు చేయాలనుకునే పసిడి ప్రియులకు అదిరిపోయే శుభవార్త అందింది. వరుసగా మూడు రోజుల బంగారం ధర ఒక్కసారిగా దిగివచ్చింది. ఇంతకి నేడు మార్కెట్‌ లో  బంగారం ధర ఎంతో తెలుసుకుందాం.

బంగారం కొనలనుకొనే పసిడి ప్రియులకు అదిరిపోయే శుభవార్త అందింది. వరుసగా గత మూడు రోజుల నుంచి బంగారం ధరలు క్రమంగా కుప్పకూలుతున్నాయి. కాగా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందుతున్న సానుకూల సంకేతాలతో దేశీయంగా ధరలు దిగివస్తున్నాయి. రికార్డ్ గరిష్ఠాల నుంచి గోల్డ్ రేట్లు పడిపోతుండడం పసిడి ప్రియులకు ఊరటగా చెప్పవచ్చు. ఇన్నాళ్లు ధరలు పెరుగుతుండడంతో పసిడి, వెండి కొనేందుకు వెనకడుగు వేసిన వారికి కొనుగోలు చేసేందుకు మంచి అవకాశంగా బులియన్ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. మళ్లీ ధరలు పెరగకముందే కొనుగోలు చేయడం మంచిదంటున్నారు. ఓవైపు చూస్తే ఇప్పుటీ ధరలు భారీగానే ఉన్నప్పటికీ గత 15 రోజుల క్రితం నాటి ధరలతో చూసుకుంటే మాత్రం భారీగానే దిగివచ్చాయని చెప్పవచ్చు.

అయితే  నిన్న 22 క్యారెట్ల తులం బంగారంపై రూ.1000 తగ్గగా.. నేడు రూ.900 తగ్గింది. దాంతో ఈ రెండు రోజుల్లో తులం బంగారంపై రూ.1900 తగ్గింది. శుక్రవారం (మే 23) బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,400గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,440 వద్ద కొనసాగుతోంది. మరి దేశంలోని పలు ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఇక దేశ రాజధాని ఢిల్లీలో నేడు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,550గా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,590గా కొనసాగుతుంది. అలాగే ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.66,400 కాగా.. 24 క్యారెట్ల ధర రూ.72,440గా ఉంది. ఇక న్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.66,500.. 24 క్యారెట్ల ధర రూ.72,550గా నమోదైంది.

దీంతో పాటు బెంగళూరు, కోల్‌కతా, కేరళ, హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.66,400 కాగా.. 24 క్యారెట్ల ధర రూ.72,440గా నమోదైంది. ఇక బంగారంతో పాటు నేడు వెండి ధరలు కూడా స్వల్పంగా తగ్గాయి. అయితే నేడు కిలో వెండిపై రూ.500 తగ్గి.. రూ.92 వేలుగా ఉంది. ఈరోజు ఢిల్లీలో కిలో వెండి ధర రూ.92,000గా ఉండగా.. ముంబైలో రూ.92,000గా ఉంది. చెన్నైలో రూ.96,500లుగా నమోదవ్వగా బెంగళూరులో రూ.92,500గా ఉంది. ఇక హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ.96,500లుగా ఉంది. మరి, ప్రస్తుతం భారీగా దిగి వచ్చిన బంగారం ధరల పై మీ అభిప్రాయం కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.