Krishna Kowshik
Krishna Kowshik
బంగారం అంటే మహిళలకు ఇష్టం, ప్రేమే కాదు అంత కంటే ఓ ఎమోషన్. స్టేటస్ సింబల్. చిన్న ఫంక్షనైనా శరీరం నిండా బంగారం ధరించాల్సిందే. బంగారం కన్నా డైమండ్‌కు విలువ ఎక్కువ అయినా, మగువల చూపు మాత్రం దగాదగా మెరిసే పుత్తడి పైనే. సీజన్‌తో సంబంధం లేకుండా.. ధర హెచ్చు తగ్గులను బట్టి గోల్డ్‌ను కొంటుంటారు నారీమణులు. అలాంటి పసిడి ప్రియులకు ఊరట కల్గిస్తున్నాయి ప్రస్తుతం బంగారం, వెండి ధరలు. గత వారం రోజులుగా బంగారం ధర పడిపోతూ వస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో బంగారం ధర క్షీణించడంతో భారత్‌లో కూడా ధరలు క్రమ క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. దసరా, దీపావళి పండుగులు కూడా వస్తుండటంతో.. పెద్ద మొత్తంలో గోల్డ్ కొనాలని అనుకునే వారికి ఇది మంచి తరుణమనే చెప్పొచ్చు.
బంగారం బాటలోనే వెండి కూడా నడుస్తుంది. ప్రస్తుతం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధర వరుసగా ఆరో రోజు కూడా పడిపోయింది. ప్యూర్ 24 క్యారెట్ల గోల్డ్ ధర 10 గ్రాములపై రూ. 330 తగ్గింది. దీంతో తులం ధర రూ. 58 వేల 200 పలుకుతోంది. అలాగే 22 క్యారెట్ల ఆర్నమెంట్ గోల్డ్ ధర 10 గ్రాములకు 330 తగ్గి, రూ. 53,335గా నడుస్తోంది. సిల్వర్ ధరలు కూడా దిగి వచ్చాయి. బంగారాన్ని కొనలేని వారు.. ఎక్కువగా సిల్వర్ ఆభరణాలను కొంటున్నారు. ప్రస్తుతం భాగ్యనగరిలో సిల్వర్ ధరలు భారీగా పతనమయ్యాయి. కిలోకి రూ. 1500 మేర పడిపోయింది. క్రితం రోజు రూ. 1000 పడిపోయింది. అంటే రెండు రోజుల్లోనే రూ. 2500 ధర తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ. 76 వేలుగా ట్రేడింగ్ అవుతోంది. తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా గోల్డ్, సిల్వర్ ధరలు ఇంచుమించు ఇలానే ఉంటాయి.