P Krishna
ఇటీవల దేశంలో బంగారం ధరలకు రెక్కలోచ్చాయి. గత నెలతో పోల్చితే ఈ
ఇటీవల దేశంలో బంగారం ధరలకు రెక్కలోచ్చాయి. గత నెలతో పోల్చితే ఈ
P Krishna
బంగారానికి ఎంత డిమాండ్ ఉందో అందరికీ తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా ఎలాంటి పరిణామాలు జరిగినా మొదట దాని ప్రభావం బంగారంపైనే పడుతుంది. ఇజ్రాయెల్-హమాస్ మధ్య జరుగుతున్న భీకర యుద్ద ప్రభావం ఇప్పుడు గోల్డ్ పై పడుతుంది. గత నెలలో ప్రతిరోజూ తగ్గుతూ వచ్చిన పసిడి ధరలు ఈ నెల చుక్కలు చూపిస్తున్నాయి. ప్రతిరోజు ఎంతోకొంత మేర బంగారం ధరలు పెరుగుతూ వస్తున్నాయి. బులియన్ మార్కెట్ లో నేడు బంగారం ధరలు మళ్లీ పుంజుకున్నాయి. నిన్నటితో పోల్చుకుంటే నేడు స్వల్పంగా పెరిగింది. ఇక వెండి ధరలు మాత్రం రెండు రోజులుగా స్థిరంగా కొనసాగుతున్నాయి. నేడు మార్కెట్ లో బంగారం ధరల విషయానికి వస్తే..
నేడు అంతర్జాతీయంగా బంగారం రేట్లు పెరిగిపోయాయి.. నిన్నటితో పోల్చితే 22 క్యారెట్ల 100 గ్రాముల బంగారం ధరపై రూ.10 పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై కూడా రూ.10 పెరిగింది. రెండు రోజుల నుంచి పసిడి ధరలు స్వల్పంగా పెరుగుతూ వస్తున్నాయి. సోమవారం మార్కెట్ లో 22 క్యారెట్ల 100 గ్రాముల బంగారం ధరపై రూ. 57,410 వద్ద ఉంటే.. 24 క్యారెట్ల 100 గ్రాముల బంగారం ధరపై రూ.62,630 వద్ద కొనసాగుతుంది. తెలుగు రాష్ట్రాలు హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖపట్నం లో 22 క్యారెట్ల 100 గ్రాముల గోల్డ్ రేట్ రూ.57,410 లకు పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.62,630 వద్ద ట్రెండ్ అవుతుంది. ఇక వెండి విషయానికి వస్తే.. గత రెండు రోజులుగా స్థిరంగా కొనసాగుతుంది. హైదరాబాద్, వరంగల్, విశాఖ, విజయవాడలో కిలో వెండి ధర రూ.77,500 వద్ద కొనసాగుతుంది.
దేశంలోని ముఖ్యనగరాల్లో ముంబయి, బెంగుళూరు, కోల్‌కతా 22 క్యారెట్ల పసిడి ధర రూ. 57,410 గా ఉండగా, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 62,630 వద్ద కొనసాగుతోంది. ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 57,560 గా ఉండగా, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 62,780 వద్ద కొనసాగుతుంది. చైన్నైలో 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 57,710 గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 62,960 వద్ద ట్రెండ్ అవుతుంది. ఇక వెండి విషయానికి వస్తే.. చెన్నైలో కిలో వెండి ధర రూ.77,500 ఉండగా, ఢిల్లీ, కోల్‌కతాలో లో కిలో వెండి ధర రూ.74,600 వద్ద కొనసాగుతుంది. బెంగుళూరు లో కిలో వెండి ధర రూ. 74,250 వద్ద ట్రెండ్ అవుతుంది. ప్రస్తుతం పండుగలు, పెళ్లిళ్ల సీజన్ కావడంతో మహిళలు ఎక్కువగా బంగారు ఆభరణాలు కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతున్నారు. దీంతో డిమాండ్ బాగా పెరిగిపోతుంది.