P Krishna
దేశంలో ప్రతిరోజూ బంగారం ధరలు పెరిగిపోతూనే ఉన్నాయి. ప్రపంచం మార్కెట్ లో ఏర్పడిన అనిశ్చితి వల్ల బంగారం పై ప్రభావం పడటంతో ధరల్లో మార్పులు సంభవిస్తున్నాయని ఆర్థిక నిపుణులు అంటున్నారు.
దేశంలో ప్రతిరోజూ బంగారం ధరలు పెరిగిపోతూనే ఉన్నాయి. ప్రపంచం మార్కెట్ లో ఏర్పడిన అనిశ్చితి వల్ల బంగారం పై ప్రభావం పడటంతో ధరల్లో మార్పులు సంభవిస్తున్నాయని ఆర్థిక నిపుణులు అంటున్నారు.
P Krishna
ఇటీవల దేశంలో బంగారం కోనుగోలు విపరీతంగా పెరిగిపోయింది. ధరల హెచ్చుతగ్గులు అవుతున్నా.. మహిళలు పసిడి కొనుగోలు చేయడానికి ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా పండుగలు, పెళ్లిళ్ల సీజన్ లో తప్పకుండా బంగారు నగలు కొంటుంటారు. గత నెల పసిడి ధరలు ప్రతిరోజూ తగ్గుముఖం పడుతూ వచ్చాయి. దీంతో బంగారం డిమాండ్ బాగా పెరిగిపోయింది. ఈ నెల మాత్రం బంగారం రేట్లు ఆకాశాన్నంటుతున్నాయి. ప్రతిరోజూ వంద నుంచి ఐదు వందల వరకు పెరుగుతూ షాక్ ఇస్తుంది. ఇటీవల ఇజ్రయెల్-పాలస్తీన మధ్య యుద్దం కారణంగా ప్రపంచ మార్కెట్ లో అనిశ్చితి ఏర్పడి బంగారంపై ప్రభావం చూపిస్తుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో దీపావళి తర్వాత వరుసగా పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం పెరుగుదల మహిళలకు ఒకింత ఇబ్బంది అని అంటున్నాన్నారు.
దేశంలో బంగారానికి రోజు రోజుకీ డిమాండ్ భారీగా పెరిగిపోతుంది. గత నెలతో పోల్చితే ఈ నెల పసిడి ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. నిన్న రూ.200 పెరిగిన ధరలు.. ఈ రోజు మళ్లీ పెరిగాయి. 22 క్యారెట్ల పసిడి ధరపై రూ. 150 పెరిగింది. 24 క్యారెట్ల పసిడిపై రూ. 160 పెరిగింది. ఈ రోజు హైదరాబాద్, విజయవాడ, విశాఖ పట్నం, వరంగల్ జిల్లాలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 56,800 ఉండగా, 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర ధర రూ. 61,990 వద్ద ట్రెండ్ అవుతుంది. ఇలాగే కొనసాగితే వారం లో బంగారం తులం రూ.62 మార్క్ దాటే అవకాశం ఉందని అంటున్నారు. ఇక దేశవ్యాప్తంగా వెండి ధరలు కూడా పెరిగాయి. కిలో వెండి పై రూ.500 వరకు పెరిగింది. శుక్రవారం హైదరాబాద్, విశాఖ, వరంగల్, విజయవాడ మార్కెట్ లో కిలో వెండి ధర రూ.78,000 వద్ద కొనసాగుతుంది.
దేశంలోని ప్రధాన నగరాలు ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 56,950 కాగా, 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 62,110 వద్ద కొనసాగుతుంది. ముంబయి, కోల్‌కతా, బెంగళూరు, పుణె లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 56,800కాగా, 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 61,960 వద్ద కొనసాగుతుంది. బంగారం మాత్రమే కాదు.. దేశ వ్యాప్తంగా వెండి ధరలు కూడా భారీగానే పెరిగిపోతున్నాయి. ఢిల్లీ, ముంబై, కోల్‌కొతా మార్కెట్ లో నేడు కిలో వెండి ధర రూ. 75,100 వరకు పెరిగింది. చెన్నైలో కిలో వెండి ధర రూ.78,000 గా ట్రెండ్ అవుతుంది. భవిష్యత్ లో బంగారం, వెండి ధరలు మరింత ప్రియం అయ్యే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.