iDreamPost
android-app
ios-app

కోలుకోలేని షాకిచ్చిన బంగారం ధర.. వామ్మో ఇంతలా పెరిగింది ఏంటి

  • Published Nov 18, 2023 | 9:08 AMUpdated Nov 18, 2023 | 9:08 AM

వివాహాల సీజన్‌ ప్రారంభం అయ్యింది. బంగారానికి భారీ డిమాండ్‌ ఉంటుంది. అందుకు తగ్గట్టుగానే రేటు కూడా పెరుగుతోంది. ఇక నేడు ఒక్క రోజే గోల్ట్‌, సిల్వర్‌ రేట్లు భారీగా పెరిగాయి. ఆ వివరాలు..

వివాహాల సీజన్‌ ప్రారంభం అయ్యింది. బంగారానికి భారీ డిమాండ్‌ ఉంటుంది. అందుకు తగ్గట్టుగానే రేటు కూడా పెరుగుతోంది. ఇక నేడు ఒక్క రోజే గోల్ట్‌, సిల్వర్‌ రేట్లు భారీగా పెరిగాయి. ఆ వివరాలు..

  • Published Nov 18, 2023 | 9:08 AMUpdated Nov 18, 2023 | 9:08 AM
కోలుకోలేని షాకిచ్చిన బంగారం ధర.. వామ్మో ఇంతలా పెరిగింది ఏంటి

బంగారం ఎన్నటికి విలువ తగ్గని ఖరీదైన లోహం. ప్రపంచంలో మిగతా దేశాలతో పోలిస్తే.. మన దగ్గరే పసిడి వినియోగం ఎక్కువ. భారతీయలు ధరించినంత ఎక్కువ మొత్తంలో ప్రపంచంలో మరేవరు గోల్డ్‌ను వాడరనేది వాస్తవం. పండగలు, పబ్బాలు, శుభకార్యాలు.. వేడుకతో సంబంధం లేకుండా పసిడి కోనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. మన దగ్గర కనకానికి డిమాండ్‌ ఎంత భారీగా ఉంటుందో ఉత్పత్తి అంత తక్కువ. దాంతో మనం విదేశాల నుంచి బంగారాన్ని దిగుమతి చేసుకుంటాం.

ఇక తాజాగా మన దగ్గర దీపావళి పండుగ ముందు నుంచి అనగా ధన్‌తెరాస్‌ నుంచే బంగారం కొనుగోళ్లు పెరిగాయి. అందుకు తగ్గట్టుగానే పండుగ సమయంలో గోల్డ్‌ రేటు దిగి వచ్చింది. దాంతో చాలా మంది పుత్తడి కొనుగోలు చేశారు. పండుగ సమయంలో దిగి వచ్చిన బంగారం ధర గత రెండు, మూడు రోజుల నుంచి పెరుగుతోంది. ఇక నేడు ఒక్క రోజే గోల్డ్‌ రేటు భారీగా పెరిగింది. మరి నేడు దేశీయ బులియన్‌ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

నేడు హైదరాబాద్‌ బులియన్‌ మార్కెట్‌లో బంగారం ధర భారీగా పెరగింది. ఒక్క రోజులోనే పది గ్రాముల మీద ఏకంగా 600 రూపాయలు పెరిగి షాకిచ్చింది. ఇక నేడు భాగ్యనగరంలో బంగారు ఆభరణాల తయారీకి వినియోగించే 22 క్యారెట్‌ గోల్డ్‌ ధర పది గ్రాముల మీద రూ.600 పెరిగి.. రూ.56,550 కి చేరింది. క్రితం సెషన్‌లో దీని రేటు రూ. 55,950 గా ఉంది. అలానే 24 క్యారెట్‌ మేలిమి బంగారం ధర కూడా 10 గ్రాముల మీద 650 రూపాయలు పెరిగి రూ.61,690 వద్ద ట్రేడవుతోంది. క్రితం సెషన్‌లో దీని ధర 61,040 రూపాయల వద్ద అమ్ముడయ్యింది.

ఇక దేశ రాజధాని ఢిల్లీలో కూడా బంగారం ధర పెరిగింది నేడు హస్తినలో 22 క్యారెట్‌ గోల్డ్‌ రేటు పది గ్రాముల 600 రూపాయలు పెరిగి 56,700 రూపాయల వద్ద ట్రేడవుతోంది. క్రితం సెషన్‌లో ఈ ధర రూ.56,100గా ఉంది. ఇక నేడు హస్తినలో 24 క్యారెట్‌ మేలిమి బంగారం ధర పది గ్రాముల మీద రూ.650 పెరిగి 61,840 రూపాయలుగా ఉంది. క్రితం సెషన్‌లో ఈ ధర 61,190 వద్ద ట్రేడయ్యింది.

భారీగా పెరిగిన వెండి ధర..

గత కొన్ని రోజులుగా అడ్డు అదుపు లేకుండా దూసుకుపోతున్న వెండి ధర.. నేడు కూడా అదే పంథాలో ముందుకు వెళ్లింది. శనివారం నాడు వెండి ధర కిలో మీద ఏకంగా 1500 రూపాయలు పెరిగింది. ఇక నేడు హైదరాబాద్‌ మార్కెట్‌లో సిల్వర్‌ రేటు కిలో మీద 1500 రూపాయలు పెరిగి.. రూ.79,500 వద్ద అమ్ముడవుతోంది. క్రితం సెషన్‌లో ఈ ధర 78 వేలుగా ఉంది. ఇక ఢిల్లిలో కూడా వెండి ధర భారీగానే పెరిగింది. నేడు హస్తినలో సిల్వర్‌ రేటు కిలో మీద రూ.1500 పెరిగి 76,500 రూపాయల వద్ద అమ్ముడవుతోంది. క్రితం సెషన్‌లో ఈ ధర 75 వేల వద్ద ఉంది.

అంతర్జాతీయ మార్కెట్‌లో సైతం బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయి. యూఎస్‌ ఫెడ్‌ వడ్డీ రేట్లలో మార్పులు, డాలర్ విలువ పెరుగుదలతో పాటూ ఇజ్రాయిల్, పాలస్తీనా యుద్దం కూడా పసిడి ధరలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఫలితంగా మన దగ్గర కూడా గోల్డ్‌, సిల్వర్‌ రేట్లు భారీగా పెరుగుతున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి