iDreamPost
android-app
ios-app

బంగారం కొనాలనుకునేవారు త్వరపడండి.. ఈ అవకాశం మళ్లీ రాదు!

  • Published Jun 30, 2023 | 11:54 AMUpdated Jun 30, 2023 | 11:54 AM
  • Published Jun 30, 2023 | 11:54 AMUpdated Jun 30, 2023 | 11:54 AM
బంగారం కొనాలనుకునేవారు త్వరపడండి.. ఈ అవకాశం మళ్లీ రాదు!

బంగారం ధరలు ఎప్పుడు ఎలా ఉంటాయో అర్థం కానీ పరిస్థితి. అంతర్జాతీయ మార్కెట్‌లో పరిస్థితులు, డాలర్‌ విలువ, ఫెడ్‌ వడ్డీ రేట్లలో మార్పులకు అనుగుణంగా బంగారం ధర మారుతూ ఉంటుంది. మిగతా దేశాలతో పోలిస్తే.. భారతదేశం బంగారాన్ని ఎక్కువగా వినియోగిస్తుంది. మన దేశంలో ఆడ, మగ తేడా లేకుండా అందరూ బంగారం ధరించడానికి ఇష్టపడతారు. మన దగ్గర పసిడి లభ్యత చాలా తక్కువ. అందుకే మనం విదేశాల నుంచి బంగారాన్ని దిగుమతి చేసుకుంటాం. ప్రపంచంలో బంగారం దిగుమతి చేసుకునే దేశంలో ఇండియానే టాప్‌లో ఉంటుంది. మన దేశంలో పండగలు, వివాహాది శుభకార్యాల వేళ బంగారాన్ని కొనుగోలు చేస్తుంటారు. ఒంటి మీద ఎంత ఎక్కువ బంగారం ఉంటే.. అంత ధనవంతుల కింద లేక్కేస్తారు.

అయితే ఓ ఐదారేళ్లుగా బంగారం ధర భారీగా పెరుగుతోంది. పది గ్రాముల పసిడి ధర అర లక్ష ఎప్పుడో దాటింది. పెరుగుతున్న ధర కారణంగా సామాన్యులు పసిడి కొనుగోలు చేయాలంటేనే భయపడుతున్నారు. అత్యవసరం అయితే తప్ప.. బంగారం కొనుగోలు జోలికి వెళ్లడం లేదు. పసిడి ధర దిగి వస్తే బాగుండు అని ఆశపడుతున్నారు. అదిగో అలాంటి వారికి ఇది భారీ శుభవార్త అనే చెప్పవచ్చు. వరుసగా నేడుగా కూడా బంగారం ధర దిగి వచ్చింది. మరి 10 గ్రాముల పసిడి ధర ఎంత తగ్గింది అంటే..

నేడు కూడా బంగారం ధర భారీగానే దిగి వచ్చింది. భాగ్యనగరం బులియన్‌ మార్కెట్‌లో చూస్తే.. వరుసగా మూడో రోజు కూడా బంగారం ధర దిగి వచ్చింది. ఈ మూడు రోజుల్లో 10 గ్రాముల పసిడి ధర ఏకంగా రూ. 500లకు పైగా దిగివచ్చింది. నేడు హైదరాబాద్‌ మార్కెట్‌లో 22 క్యారెట్‌ పసిడి  10 గ్రాముల ధర రూ. 200 తగ్గి రూ. 53,850 గా ఉంది. అలానే 24 క్యారెట్‌ స్వచ్ఛమైన పసిడి ధర 10 గ్రాముల మీద రూ. 210 పడిపోయి రూ. 58, 750 వద్ద కొనసాగుతోంది.

ఇక ఢిల్లీ మార్కెట్లో చూస్తే 22 క్యారెట్‌ బంగారం ధర ఇవాళ 10 గ్రాముల మీద రూ. 200 తగ్గి రూ. 54 వేలకు చేరింది. అలానే 24 క్యారెట్‌ మేలిమి బంగారం ధర పది గ్రాముల మీద రూ. 210 తగ్గి రూ. 58,900 చేరింది. గత కొన్ని రోజుల్లో బంగారం ధర ఈస్థాయిలో దిగి రావడం ఇదే ప్రథమ. కనుక బంగారం కొనాలనుకునేవారు ఏమాత్రం ఆలస్యం చేయకుండా.. ఇప్పుడే కొనుగోలు చేస్తే మంచిది అంటున్నారు బులియన్‌ మార్కెట్‌ విశ్లేషకులు.

తగ్గిన వెండి ధర..

గత కొన్ని రోజులుగా పెరుగుతూ పోయిన వెండి ధర.. నేడు మాత్రం దిగి వచ్చింది. ఇక శుక్రవారం హైదరాబాద్ మార్కెట్లో వెండి ధర తగ్గింది. కిలో వెండి ధర మీద రూ.400 తగ్గి.. రూ. 75,300లకు దిగివచ్చింది. బంగారం ధర గత మూడు రోజులుగా దిగి వస్తే.. వెండి ధర మాత్రం పైపైకి ఏగబాగింది. క్రితం రెండు సెషన్లలో కిలో వెండి ధర ఏకంగా రూ. 1100 మేర పెరిగింది. కానీ నేడు మాత్రం వెండి ధర తగ్గింది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో చూసుకుంటే వెండి రేటు ఇవాళ స్థిరంగా ఉంది. కిలో వెండి ధర రూ. 71,900 పలుకుతోంది. క్రితం రెండు సెషన్లలో చూసుకుంటే ఢిల్లీలో కిలో వెండి ధరపై ఏకంగా రూ. 1000 పెరిగిన విషయం తెలిసిందే.

అంతర్జాతీయంగా దిగి వచ్చిన ధర..

దేశీయంగానే కాక.. అటు అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం ధర తగ్గుతూ వస్తోంది. నేడు గ్లోబల్ బులియన్ మార్కెట్లో బంగారం ధర పడిపోయింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ మరోసారి వడ్డీ రేట్ల పెంపు తప్పదనే సంకేతాలు ఇచ్చిన క్రమంలో డాలర్ విలువ పుంజుకుంటోంది. దాంతో బాండ్ ఈల్డ్స్‌కు గిరాకీ పెరగడం, బంగారంపై పెట్టుబడులు ఉపసంహరించుకుంటున్న కారణంగా అంతర్జాతీయంగా కూడా పసిడి ధరలు పతనమవుతున్నాయి. స్పాట్ గోల్డ్ రేటు 3 నెలల కనిష్ఠానికి దిగివచ్చింది. ఇవాళ స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 1907 డాలర్ల వద్దకు పడిపోయింది. ఇక స్పాట్ సిల్వర్ రేటు ఒక ఔన్సుకు 22.59 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి