iDreamPost
android-app
ios-app

సీఎంకు లేఖ రాసి.. కన్న బిడ్డను బేరానికి పెట్టిన తండ్రి..!

సీఎంకు లేఖ రాసి.. కన్న బిడ్డను బేరానికి పెట్టిన తండ్రి..!

ప్రతి మనిషి జీవితం పూల పాన్పులా ఉండదు. ఒకపూట కూడ తిండి దొరక్క పస్తులు ఉండే వాళ్లు చాలామందే ఉన్నారు. అంతేకాక  కొన్ని కుటుంబాలలో అనేక ఆర్థిక సమస్యలు ఎదురౌతుంటాయి. అప్పటి వరకు మంచిగా ఉన్న కంపెనీలు కూడా తమ ఉద్యోగులను ఉన్నఫలంగా జాబ్ ల నుంచి తొలగిస్తున్నాయి. నిత్యావసరాల ఖర్చులు, ఇతరాత్ర ఖర్చులు పెరిగిపోవడం వలన మధ్య తరగతి కుటుంబాల్లో అనేక ఆర్థిక సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో ఆర్థిక సమస్యల నుంచి బయట పడేందుకు కొందరు కన్న బిడ్డలను అమ్మేస్తున్నారు. తాజాగా ఆర్థిక సమస్యల వలన కన్న కొడుకును విక్రయించిన ఘటన ఉత్తర్ ప్రదేశ్ లోచోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

ఉత్తర ప్రదేశ్ లోని అలీగఢ్ ప్రాంతంలో సంజయ్ సైనీ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. అతడికి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. వీరితో పాటు సైనీ కు సోదరీమణులు కూడా ఉన్నారు. అతడు స్థానికంగా తమలపాకుల వ్యాపారం చేసుకుంటూ కుటుంబాని పోషిస్తుండే వాడు. అయితే ఇటీవల దానిని కొందరు కబ్జా చేశారు. దీంతో ఆయన జీవనోపాది కూడా పోయింది. వివిధ ప్రాంతాల్లో వడ్డీకి డబ్బులను అప్పుగా తెచ్చుకున్నాడు. అప్పులుగా బాగా పెరిగి పోవడంతో అవి ఎలా తీర్చాలో అర్థం కాలేదు.

అలానే కుమార్తెల పెళ్లిళ్ల కోసం.. తన కన్న కొడుకును అమ్మకానికి పెట్టాడు. అదే సమయంలో, తన ఇద్దరు సోదరీమణులు, ముగ్గురు కుమార్తెలను పోషించలేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నానని సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు  లేఖ రాశాడు.. వినడానికి మీకు వింతగా అనిపించిన సంజయ్ సైనీ.. కుటుంబం కోసం కన్న కొడుకును అమ్మేశాడు. తన ఇద్దరు కుమార్తెల పెళ్లిళ్లు చేయడానికి డబ్బులు లేక.. . నిస్సహాయుడైన ఆయన కలత చెంది.. బిడ్డను అమ్మకానికి పెట్టాడు. ఇక సీఎంకు రాసిన లేఖలో తన బాధలను వివరించాడు.

 “నాకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వీరికి పెళ్లిళ్లు చేయాల్సి ఉంది. అయితే.. నేను కుటుంబాన్ని పోషించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. కుటుంబాన్ని పోషించడానికి తమలపాకుల దుకాణంను నడిపించేవాడిని.అయితే… ఇప్పుడు రౌడీలు దురుద్దేశంతో పాన్ షాపును కబ్జా చేసి తన జీవనోపాధిని లాగేసుకుంటున్నారు” అని సీఎం యోగి ఆదిత్యనాథ్ కి లేఖ రాశారు. అంతేకాక తనకు ఆర్థిక సాయం చేయాలని, తన తమపాల దుకాణాన్ని తిరిగి ఇప్పించాలని సీఎంను కోరారు. ప్రస్తుతం ఈ ఘటన వార్తలలో నిలిచింది. మరి.. ఈ వార్తపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి