భార్య ఖర్చులకు 7 బస్తాల్లో నాణేలు ఇచ్చిన భర్త!

భార్య ఖర్చులకు 7 బస్తాల్లో నాణేలు ఇచ్చిన భర్త!

భార్యాభర్తల మధ్య గొడవలు అనేది సర్వసాధారణం. ఎంతో మంది దంపతలు కుటుంబంలో వచ్చే సమస్యలను, మనస్పర్థలకు సర్థుకుపోతూ జీవిస్తుంటారు. కొందరు దంపతులు మాత్రం పంతాలకు పోయి.. చివరకు కోర్టు మెట్లు ఎక్కుతుంటారు. ఇలాంటి సందర్భంల్లో  ఎక్కువ శాతం భార్యలకే అనుకూలంగా తీర్పులు వస్తాయి. కోర్టులకు ఎన్నో విడాకుల కేసులు వస్తూ ఉంటాయి. అయితే ఓ అరుదైన విడాకులు కేసు అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. భార్య పోషణకు డబ్బులు చెల్లించమని చెప్పిన కోర్టుకే ఓ వ్యక్తి షాకిస్తే.. అతడికే తిరిగి దిమ్మతిరిగే షాకిచ్చింది కోర్టు. అసలు స్టోరి ఏంటి అనే కదా మీ సందేహం.. అయితే ఈ స్టోరీ చదవాల్సిందే…

రాజస్థాన్‌ రాష్ట్రంలోని జైపుర్‌లో హర్మదా ప్రాంతానికి చెందిన దశరథ్‌ కు కొన్నేళ్ల కిందట సీమా అనే మహిళతో వివాహమైంది.  చాలా కాలం పాటు వీరిద్దరు ఎంతో సంతోషంగా జీవించారు. ఒకరంటే మరొకరు విడిచి ఉండలేనంతగా జీవించారు. అయితే కొంతకాలం తరువాత ఈ దంపతుల మధ్య మనస్పర్ధలు రావడంతో విడాకుల కోసం ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. ఈ కేసు చాలా కాలం నుంచి విచారణలో ఉంది. ఇదే  సమయంలో సీమ.. తన భర్త నుంచి విడిగా ఉంటుంది. సీమాకు ప్రతినెలా రూ.5 వేలు పోషణ ఖర్చుల కింద ఇవ్వాలని ఫ్యామిలీ కోర్టు ఆమె భర్తను ఆదేశించింది.

అయితే కోర్టు తీర్పును ధిక్కరిస్తూ దాదాపు 11 నెలలుగా అతను ఆ మొత్తాన్ని చెల్లించడం లేదు. దీంతో సీమా మరోసారి  ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. దీంతో దశరథ్ పై న్యాయస్థానం సీరియస్ అయి.. అరెస్ట్ వారెంట్‌ జారీ చేసింది. దీంతో జూన్‌ 17న అతణ్ని పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం అదనపు జిల్లా న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చారు. దశరథ్‌ అరెస్టు కావడంతో అతని కుటుంబ సభ్యులు ఏకంగా రూ.55 వేల మొత్తాన్ని ఒకటి, రెండు రూపాయిల నాణేల రూపంలో 7 బస్తాల్లో న్యాయస్థానానికి తీసుకువచ్చారు. ఆమెను మానసికంగా వేధించాలని ఉద్దేశ పూర్వకంగానే ఇలా నాణేలుగా తీసుకొచ్చారని సీమ తరఫు న్యాయవాది వాదించారు.

అయితే వారి మాటలు పట్టించుకోని న్యాయస్థానం నాణేల రూపంలో డబ్బులు చెల్లించేందుకు అంగీకరించింది. దీంతో అతడు.. తనపై భార్యను మానసికంగా ఇబ్బందికి గురి చేయోచ్చని అనుకున్నాడు. అంతలోనే అతడికి కోర్టు దిమ్మతిరిగే షాకిచ్చింది. ఆ నాణేలను తదుపరి విచారణ రోజున దశరథ్‌ కోర్టులోనే స్వయంగా లెక్కించి రూ.1000 వంతున ప్యాకెట్లుగా చేసి ఆమెకు అందజేయాలని ఆదేశించింది. తనకు మద్దుతు ఇచ్చినట్లే ఇచ్చి.. ఇలా తీర్పు ఇవ్వడంతో దశరథ్ షాకి గురయ్యాడు. మరి.. ఈ వింత ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments