iDreamPost
android-app
ios-app

శాపంగా మారిన స్నేహితురాలి బంధువుతో పరిచయం!

శాపంగా మారిన స్నేహితురాలి బంధువుతో పరిచయం!

ప్రేమ అనేది ఎంతో పవిత్రమైనది. ఈ రెండు అక్షరాల ప్రేమ రెండు మనస్సులను ఒకటిగా కలిపి.. నిండు నూరేళ్లు హాయిగా జీవించేలా చేస్తుంది. ఇలా ప్రేమించుకుని ఎందరో పెళ్లి బంధంలో అడుగు పెట్టి సంతోషంగా జీవిస్తున్నారు. ఇది నాణేంకి ఒక వైపు మాత్రమే.. మరోవైపు ప్రేమ పేరుతో మోసం చేసే కేటుగాళ్లు ఉన్నారు. శారీరకంగా ఆడపిల్లల వాడుకునేందుకు ప్రేమ అనే ముసుగును ధరింస్తారు. వారి మాయ  తెలియక ఎందరో యువతులు.. నిండా మునిగిపోతున్నారు. మరికొందరు యువతులు అయితే ఆత్మహత్యలు చేసుకుని నూరేళ్ల జీవితాన్ని అర్ధాంతరంగా ముగిస్తున్నారు. తాజాగా కర్ణాటకలో అలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే…

కర్ణాటక రాష్ట్రం బళ్లారికి చెందిన అమృత అనే యువతి పీయూసీ పూర్తి చేసింది. ఈ క్రమంలో తన స్నేహితురాలి భర్త..సోదరుడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఇక ప్రేమ పేరుతో వారు చాలకాలం పాటు తెగ ఎంజాయ్ చేశారు. నిన్ను వదలి నేను ఉండలేను, నువ్వు లేక నేను లేను, నువ్వే నా ప్రాణం అంటూ సినిమా పేర్లు చెప్పి.. ఆ యువకుడు యువతిని వలలో వేసుకున్నాడు. ఇక ఆమెతో శారీరక సుఖం కోస తెగ ప్రయత్నాలు చేశాడు. చాలా కాలం పాటు ఒప్పుకోని సదరు యువతి .. అతడి మాయమాటలను  పూర్తిగా నమ్మింది.

చివరకు అతడితో శారీరక సంబంధం పెంచుకుంది. అలా కొన్ని రోజులు గడిచిన తరువాత యువతి పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చింది. అప్పటి వరకు యువతితో తిరుగుతూ శారీరక సంబంధం పెంచుకున్న యువకుడు పెళ్లికి నిరాకరించాడు. తన ఇంట్లో వారు పెళ్లికి ఒప్పుకోవడం లేదని యువతితో తెలిపాడు.అయితే పెళ్లి చేసుకోవడానికి అడ్డు వచ్చిన కులం.. ప్రేమ, శారీరక సంబంధం ఏర్పచుకోవడానికి ఎందుకు అడ్డు లేదని యువతి ప్రశ్నించింది. చివరకు ప్రేమ పేరుతో శారీరకంగా వాడుకుని యువకుడు మోసం చేశాడని సదరు యువతి మనస్తాపం చెందింది.  ఈక్రమంలో ఆత్మహత్యకు ప్రయత్నించింది.

గుర్తించిన స్థానికులు ఆస్పత్రిలో చేర్పించగా.. నాలుగు రోజుల నుంచి చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. ఆత్మహత్యకు ముందు యువతి  సూసైడ్ లేఖ రాసింది. అందులో తను మోసం చేసిన వ్యక్తి పూర్తి వివరాలు తెలిపింది. అబ్బాయి కుటుంబీకులు అవమానించారని ఆ యువతి లేఖ రాసింది. ప్రస్తుతం యువతి మృతి కేసులో నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.