iDreamPost
android-app
ios-app

దారుణం: మైనర్ బాలికపై రెండేళ్లుగా స్వామీజీ అత్యాచారం!

దారుణం: మైనర్ బాలికపై రెండేళ్లుగా స్వామీజీ అత్యాచారం!

సమాజంలో ఆడపిల్లలు, మహిళలు, చిన్నారులపై వేధింపులు, లైంగిక దాడులు జరుగుతూనే ఉన్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేసిన  మహిళలపై వేధింపులు మాత్రం ఆగడం లేదు. ఇంకా దారుణం ఏమిటో ఆధ్యాత్మికత నిలయంగా ఉండే ఆశ్రమాల్లో కూడా లైంగిక వేధింపులు జరుగుతున్నాయి. స్వామీజీల రూపంలో  ఉండే కొందరు బాలికలపై అత్యాచారాలకు పాల్పడుతున్నారు. తాజాగా అనాథ బాలికకు(15) అశ్రయం కల్పించిన నిర్వాహకుడే రెండేళ్లుగా లైంగిక దాడులకు పాల్పడ్డాడు. ఈ ఘటన అసల్యంగా వెలుగులోకి వచ్చింది. సీడబ్ల్యూసీ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..

 ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి గొలనుగొండ గ్రామానికి చెందిన ఓ బాలిక తల్లిదండ్రులు చనిపోయారు. దీంతో ఒక మహిళ బాలికను ప్రభుత్వ వసతి గృహంలో ఉంచి చదివించేది. ఆ మహిళా అధ్యాత్మిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటుంది. ఈ క్రమంలోనే బాలికను కూడా రెండేళ్ల క్రితం విశాఖ పట్నంలోని వెంకోజీపాలెం సమీపంలోని జ్ఞానానంద, రామానంద ఆశ్రమంలో చేర్పించింది. ఆ ఆశ్రమాన్ని పూర్ణానంద సరస్వతి స్వామీజీ నిర్వహిస్తుండే వాడు. ఆ స్వామీజి ఈ బాలికతో పాటు మరో 13 మంది బాలికలతో పశువుల నిర్వహణ పనులు చేయిస్తూనే లైంగిక వేధింపులకు  గురిచేసే వాడు. భయంతో అశ్రమం నుంచి వెళ్లిపోతానని బాలిక ఏడ్చేది. కనికరించకపోగా ఆ బాలిక కాళ్లకు గొలుసులు కట్టి పనులు చేయిస్తుండేవాడు.

ఈ నేపథ్యంలో జూన్ 12న స్నానానికి వెళ్లేందుకు గొలుసులు తీయడంతో ఒక మహిళ సహకారంతో బాలిక బయటకు పారిపోయింది. రైల్వేస్టేషన్‌ కి చేరుకున్న బాలిక తిరుమల ఎక్స్‌ప్రెస్‌ రైలు ఎక్కింది. అదే రైల్లో విజయవాడ వస్తున్న ఒక కుటుంబం బాలిక స్థితి చూసి వివరాలు అడిగింది. తమతో పాటు తీసుకెళ్లి.. సోమవారం కంకిపాడు పోలీసుల సహకారంతో సీడబ్ల్యూసీ సభ్యులకు అప్పగించింది. వారు బాలికకు కౌన్సెలింగ్‌ నిర్వహించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అశ్రమం పేరుతో జరుగుతున్న లైంగిక దాడులపై మైనర్ బాలిక చేత దిశ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయించారు. బాలిక ఫిర్యాదుతో ఆశ్రమానికి చేరుకొని దొంగ స్వామీజీని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు మాట్లాడుతూ విజయవాడలో జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదైందని తెలిపారు. అయితే స్వామీజీని అదుపులోకి తీసుకోవడంపై పోలీసులు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş