iDreamPost
android-app
ios-app

డీమార్ట్ కి వెళ్లిన భర్త.. తిరిగి ఇంటికి వచ్చేసరికి భార్య అలా..

డీమార్ట్ కి వెళ్లిన భర్త.. తిరిగి ఇంటికి వచ్చేసరికి భార్య అలా..

నేటికాలంలో ఆత్మహత్య ఘటనలు బాగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా యువతి, యువకులే ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఆ తరువాత వివాహిత మహిళలు బలవన్మరణం చేసుకుంటున్నారు. ఆర్థిక, అనారోగ్య, ఇతర సమస్యల కారణంగా తీవ్ర మానసిక ఒత్తిడికిలోనై ఆత్మహత్యనే పరిష్కరంగా భావిస్తుంటారు. తాజాగా దివ్య అనే వివాహిత  ఉద్యోగానికి వెళ్లిన భర్తకు షాకిచ్చింది. ఎలుక మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…

మహారాష్ట్రకు చెందిన దివ్య(18) అదే రాష్ట్రానికి చెందిన వికాస్‌తో వివాహం జరిగింది. వారిద్దరు బతుకుదెరవు కోసం హైదరాబాద్ వచ్చారు. నగరంలోని పటాన్ చెరువు ప్రాంతంలోని ఇస్నాపూర్ లో ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. వికాస్ స్థానికంగా ఉండే డీమార్ట్ లో పని చేస్తున్నాడు. ఇలా నిత్యం ఉద్యోగానికి వెళ్లి తిరిగి సాయంత్రం సమయంలో ఇంటికి వచ్చే వాడు. నెలకు వచ్చే సంపాదనతో వికాస్ దంపతులు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఈ నెల 25వ తేదీన వికాస్‌ ఎప్పటిలాగే ఉద్యోగానికి వెళ్లగా మధ్యాహ్నం సమయంలో అతని భార్య దివ్య పోన్‌చేసి ఇంటికి రమ్మని చెప్పింది. దీంతో వెంటనే కంగారుగా వికాస్‌ ఇంటికి వెళ్లాడు.

ఎలుకల మందు తాగానని దివ్య..వికాస్ తో చెప్పింది. దీంతో ఆమెను వెంటనే పటాన్‌చెరులోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. దివ్య చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందింది. సమాచారం తెలుసుకున్న స్థానిక పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పటాన్‌చెరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తనను ఎంతో ప్రేమగా చూసుకునేదని, జీవితాంతం అలానే చూసుకుంటుందని నమ్మిన తనను మోసం చేసి వెళ్లిపోయిందని మృతురాలి భర్త రోధించాడు. తన కూతురు ఆరోగ్య పరిస్థితి సరిగాలేక ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తల్లి రాధాగజనాన్‌ తెలిపింది. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మరి… ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet