iDreamPost
android-app
ios-app

APలో భారీ పేలుడు.. ఇళ్లు ధ్వంసం.. దంపతుల పరిస్థితి విషమం!

APలో భారీ పేలుడు.. ఇళ్లు ధ్వంసం.. దంపతుల పరిస్థితి విషమం!

తరచూ ఏదో ఒక ప్రాంతంలో పేలుడు ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.  రసాయనాల పేలుడు వంటి ఇతర కారణాలతో ఈ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ పేలుడు ఘటనల్లో ఎంతో ప్రాణాలు కోల్పోతున్నారు. మరెందరో తీవ్రంగా గాయపడుతున్నారు. ఇటీవలే అనంతపురంలో ఓ భారీ పేలుడు జరిగి.. ఓ వ్యక్తి ముక్కలు ముక్కలయ్యాడు. తాజాగా కుప్పంలో భారీ పేలుడు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో దంపతులు తీవ్రంగా గాయపడ్డారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

చిత్తూరు జిల్లా కుప్పంలోని పెద్దపల్లి గంగమాంబ దేవస్థానం సమీపంలో ఉన్న ఒక ఇంట్లో ఒక్కసారిగా నిన్న అర్థరాత్రి  పేలుడు సంభవించడం జరిగింది. అకస్మాత్తుగా జరిగిన పేలుడుతో సంభవించడంతో చుట్టు పక్కల ఉన్న జనాలు భయాందోళనకు గురయ్యారు. స్థానికులు బయటకు వచ్చి చూసే సరికి ఇళ్లు పూర్తిగా ధ్వంసమైంది. ప్రమాదానికి గురైన ఆ ఇంట్లో ఇద్దరు దంపతులు నివాసం ఉంటున్నారు. వారిద్దరు తీవ్రంగా  గాయాలపాలయ్యారు.  బాధితులు మురుగేష్, ధనలక్ష్మిలుగా గుర్తించారు. వారు స్టీల్ సామన్లు వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అయితే పేలుడుకు గల కారణాలు ఏంటనేది తెలియరాలేదు.  తీవ్రంగా గాయపడిన దంపతులను స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. స్థానికులు సమాచారం అందించడంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏవరైన గుర్తు తెలియని వ్యక్తులు పేలుడు పదార్థాలు ఉపయోగించడం వలనే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు దంపతులు నివాసం ఉంటున్న ఇంటి గుమ్మం ముందు నాటు బాంబులు, జిలిటెన్ స్టిక్స్ వంటివి పెట్టి పేల్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఈ ఘటనకు పాల్పడిన వారు ఎవరు? దంపతులకు , వారికి మధ్య ఉన్న గొడవ ఏమిటి? అనే వివరాలు తెలియాల్సి ఉంది. ఇళ్ల మధ్య  భారీ  పేలుడు సంభవించడం స్థానికంగా కలకలం రేపింది. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

jojobet girişgamdomCasibomjojobetJojobet Girişjojobet güncel giriş