iDreamPost
android-app
ios-app

సంతోషంగా సాగిపోతున్న కాపురం.. ఆ ఒక్కదానితో అంతా ఔట్!

సంతోషంగా సాగిపోతున్న కాపురం.. ఆ ఒక్కదానితో అంతా ఔట్!

భార్యాభర్తల మధ్య గొడవలు అనేవి సర్వసాధారణం. పాలునీళ్లాల కలిసి పోయి.. సంసారాన్ని ముందుకు సాగించాలి. ఎన్ని గొడవులు, ఇబ్బందులు వచ్చిన సర్థుకుపోతూ.. జీవితాంతం కలిసి నడవాలి. అయితే కొన్ని సంసారాలు వివాహేతర సంబంధాల కారణంగా నిట్టనిలువునా కాలిపోతున్నాయి. పరాయి వారితో పడక సుఖం కోసం భాగస్వామిని, కన్న బిడ్డలను హత్యలు చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు ఒక వైపు  కేవలం అనుమానం కారణంగానే కూలిపోయే సంసారాలు మరికొన్ని ఉన్నాయి. అనుమానంతో భార్యలను హత్య చేసే భర్తలు బాగా పెరిగి పోయారు. ఇప్పటికే అనేక ఘటనలు జరగ్గా.. తాజాగా ఓ వ్యక్తి .. భార్యపై  అనుమానంతో  అత్యంత దారుణంగా హత్య చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

 ఉపాధి నిమిత్తం ఉత్తరప్రదేశ్‌ నుంచి మీరాజ్ అలీ, ఫాతీమా(35) అనే దంపతులు హైదరాబాద్ కు వలస వచ్చారు. వివిధ ప్రాంతాల్లో ఉన్న ఆ దంపతులు.. కొంతకాలంగా ఎర్రగడ్డ డివిజన్ పరిధిలోని సుల్తాన్ నగర్ లో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు.  వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. మీరాజ్ స్థానికంగా కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఫాతీమా కూడా ఇంటిని, పిల్లలను చూసుకుంటూ కుటుంబానికి తోడుగా ఉంటుంది. ఈ దంపతులు చాలా కాలం పాటు ఎంతో సంతోషంగా ఉన్నారు. అయితే ఇటీవల కొంతకాలం నుంచి మీరాజ్..ఫాతీమా పై అనుమానం పెంచుకున్నాడు. ఈక్రమంలోనే తరచూ ఫాతిమాతో అతడు గొడవ పడేవాడు. ఇలా వారి మధ్య తరచూ ఘర్షణ వాతావరణం ఉండేది. ఈ నేపథ్యంలో మంగళ వారం రాత్రి కూడా వారిద్దరి మధ్య మరోసారి గొడవ జరిగింది.

ఈ క్రమంలోనే క్షణికావేశానికి లోనైన మీరాజ్‌అలీ ఇనుప రాడ్డుతో భార్య ఫాతిమా తలపై బలంగా కొట్టాడు. దీంతో తీవ్రం రక్తస్రావమైన ఫాతిమా.. అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో భయపడిన మీరాజ్‌అలీ ఘటన స్థలం నుంచి పరారయ్యాడు. స్థానికులు అందించిన సమాచారంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. ఆ స్థలాని పరిశీలించి.. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మృతురాలి సోదరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కేవలం అనుమానంతోనే ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాడు. అంతేకాక ముగ్గురు పిల్లలను తల్లిలేని అనాథలను చేసి.. అతడు జైలు శిక్ష అనుభవించే స్థితికి వెళ్లాడు. మరి.. ఇలాంటి ఘటనలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Girişgrandpashabet