iDreamPost
android-app
ios-app

మహిళతో వివాహేతర సంబంధం.. తాళ్లతో కట్టి ఊరేగించిన గ్రామస్థులు!

మహిళతో వివాహేతర సంబంధం.. తాళ్లతో కట్టి ఊరేగించిన గ్రామస్థులు!

ఈ మధ్యకాలంలో వివాహేతర సంబంధాలు బాగా పెరిగి పోయాయి.  వీటి కారణంగా ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. అంతేకాక ఈ అక్రమ సంబంధాలు  పచ్చని కాపురాలను నిట్ట నిలువును కాల్చేస్తున్నాయి. అంతేకాక ఇలా వివాహేతర సంబంధాలను సాగిస్తున్న వారిని.. వారి భాగస్వామ్యులు పట్టుకుని దేహశుద్ది చేసిన ఘటనలు ఉన్నాయి. తాజాగా వివాహేతర సంబంధం పెట్టుకున్న యువకుడిని, మహిళపై కొందరు గ్రామస్థులు దాడి చేశారు. ఈ ఘటన ఒడిశాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

ఒడిశాల రాష్ట్రం అనుగుల్‌ జిల్లా తాల్చేరు సమితి ఖండాలో పంచాయతీ పరిధిలోని ఓ గ్రామంలో ఉంటున్న మహిళకు వివాహమైన కొన్ని రోజులకే భర్తను కోల్పోయింది. ఆమె స్థానికంగా ఓ ఆఫీస్ లో సెక్యూరిటీ గార్డ్‌గా పని చేస్తుంది. ఆమె.. అత్త మామలతో కలిసి నివాసం  ఉంటుంది.  కొంతకాలం క్రితం బాలుగామ్‌ ప్రాంతానికి చెందిన  ఓ యువకుడితో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో తరచూ రాత్రి సమయంలో ఆ వితంతువు ఇంటికి వచ్చి వెళుతుండేవాడు. ఇంటిలోనే ఉండే ఆమె అత్తమామలు  ఆ యువకుడిని చూసినా ఏమీ చేయలేక మౌనం ఉండేవారు. ఇటీవల ఆ మహిళ అత్తామామలు కోడలి విషయాన్ని గ్రామస్థులకు తెలిపారు.

రోజూ మాదిరిగానే బుధవారం రాత్రి యువకుడు వితంతువు ఇంటిలోకి వెళ్లాడు. ఆ సమయంలో స్థానికులు కొందరు గది తలుపులకు బయట నుంచి తాళం వేశారు. మరుసటి రోజు ఉదయం వారు తలుపులు తెరిచి యువకుడు, అతడితో పాటు మహిళను తాళ్లతో కట్టి గ్రామంలో ఊరేగించారు. అనంతరం గ్రామంలోని ఓ విద్యుత్తు స్తంభానికి కట్టేశారు.  ఆ తరువాత గ్రామ పెద్దలు ఇరు కుటుంబాల వారిని పిలిచి పంచాయితీ పెట్టి.. వారిద్దరినీ వదిలిపెట్టారు. స్థానికులు వారిని కొట్టిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యాయి. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.