iDreamPost
android-app
ios-app

భార్య, అత్తకు వేరే వ్యక్తులతో అక్రమ సంబంధం! అడ్డుగా ఉన్నాడని..

భార్య, అత్తకు వేరే వ్యక్తులతో అక్రమ సంబంధం! అడ్డుగా ఉన్నాడని..

ఈ మధ్యకాలంలో అక్రమ సంబంధాలు బాగా పెరిగిపోతున్నాయి. పరాయి వారితో పడక సుఖం కోసం పచ్చని సంసారాన్ని నిట్టనిలువును కాల్చుకుంటున్నారు. ఇంకా దారుణం ఏమిటంటే.. కొందరు మహిళలు పరాయి వాడితో పడక సుఖం కోసం.. తాళి కట్టిన భర్తను, కన్న బిడ్డలను హతమారుస్తున్నారు. ఈ అక్రమం సంబంధాల కారణంగా ఇప్పటికే అనేక ప్రాణాలు పోయాయి. తాజాగా మరో వ్యక్తి ఈ వివాహేతర సంబంధానికి బలయ్యాడు. ఈ దారుణ ఘటన వైఎస్సార్ కడప జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…

కడప పట్టణంలోని దుర్గా వీధిలో షేక్‌ మహ్మద్‌ జహీర్‌(27) భార్య, అత్తతో కలసి అత్త ఇంట్లోనే నివాసం ఉంటున్నాడు. అలాగే అతడికి మద్యం సేవించే అలవాటు ఉంది. ఇదే సమయంలో అతడి భార్య, అత్త ఇద్దరు  వేరు వేరు ఇతర వ్యక్తులతో వివాహేతర సంబంధం కలిగి ఉన్నారు. దీంతో  తరచూ వారితో మహ్మద్ జహీర్ కు గొడవ పడే వాడు. ఈ నేపథ్యంలో వారి అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని జహీర్ ను చంపాలని పథకం వేశారు. ఈ నెల 17వ తేదీన రాత్రి 10.30 గంటల సమయంలో మద్యం సేవించి వచ్చిన మహ్మద్‌ జహీర్‌ను.. ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం..  జహీర్ గొంతుకు అత్త ప్లాస్టిక్‌ తాడును గట్టిగా బిగించగా, భార్య తలదిండుతో ముఖంపై గట్టిగా అదిమి పట్టింది.

దీంతో జహీర్ అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే ఈ విషయం ఎవరికీ తెలియకుండా మద్యం తాగి తమతో గొడవ పడుతూ తనంతట తాను కిందపడి మృతి చెందినట్లు అందరిని నమ్మించారు. అయితే శవ పరీక్ష నివేదిక ఆధారంగా,సాక్ష్యాల మేరకు తల్లికూతుర్లే హత్య చేశారని పోలీసులు నిర్ధారించారు. నిందితులు కూడా నేరం చేసినట్లు అంగీకరించడంతో సోమవారం రాత్రి అరెస్ట్‌ చేసి మంగళవారం కోర్టుకు హాజరు పరచారు. మరి..ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom