iDreamPost
android-app
ios-app

అర్ధరాత్రి ఇంటికి వచ్చిన భర్తకు ఆ స్థితిలో కనిపించిన భార్య!

అర్ధరాత్రి  ఇంటికి వచ్చిన భర్తకు ఆ స్థితిలో కనిపించిన భార్య!

సంసారం అనేది ప్రతి ఒక్క మనిషి జీవితంలో ఓ కొత్త ప్రయాణం. అయితే ఈ సంసారంలో చిన్న చిన్న గొడవలు అనేవి సాధారణం. ఆలుమగలు మధ్య వచ్చే గొడవలకు ఇరువురు సర్ధుకుంటూ సంసారం అనే బస్సులో జర్నీ చేయాలి. ఇద్దరూ పట్టింపులకు పోతే ఆ సంసారం అనే బస్సు బోల్తా పడుతుంది. ఎవరికైన గాయాలు కావచ్చు…లేదా.. మరేవరైనా మృతి చెందవచ్చు. ముఖ్యంగా కొందరు వివాహితలు ఆవేశానికిలోనై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా  అనంతపురంలో 22 ఏళ్ల ఓ వివాహిత ఆత్మహత్య  చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

అనంతపురం జిల్లా కొత్తచెరువు ప్రాంతంలో దీపుకుమర్, సుమన్(22) దంపతులు నివాసం ఉంటున్నారు.. దిల్లీకి చెందిన వారిద్దరూ ప్రేమించుకున్నారు. పెద్దలకు తెలిస్తే విడదీస్తారన్న భయంతో.. దిల్లీ నుంచి పారిపోయి కొత్తచెరువుకు వలస వచ్చి.. కూలీలుగా స్థిరపడ్డారు. ఇళ్లు అద్దెకు తీసుకుని సహజీవనం చేస్తున్నారు. అయితే వీరి ఆచూకి కనిపెట్టిన పెద్దలు.. పెళ్లి చేస్తామని చెప్పడంతో తిరిగి ఢిల్లీ వెళ్లారు. 20 రోజుల క్రితం సంప్రదాయబద్ధంగా పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. నవ దంపతులు నాలుగు రోజుల కిందట దిల్లీ నుంచి కొత్తచెరువుకు వచ్చారు. ఈ క్రమంలోనే సమన్ కి పుట్టింటికి వెళ్లాలని బెంగ పెట్టుకుంది. అదే విషయాన్ని భర్తకు తెలియజేయండతో అతను ససేమిరా అన్నాడు. డబ్బులేదని నెలరోజులు కూలీ  పనులు చేసుకుని వెళ్దామని భార్యకు సర్ధి చెప్పాడు.

అయినా సుమన్‌ భర్త దీపుకుమార్‌తో ఆదివారం రాత్రి గొడవపడింది. ఎంత చెప్పిన భార్య వినకపోవడంతో భర్త దీపు కుమార్ ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. మనస్తాపం చెందిన సుమన్ ఇంతలో తలుపునకు గడియ పెట్టుకుని ఫ్యానుకు చీరతో ఉరివేసుకుంది. బయటకు వెళ్లిన దీపు కుమార్ అర్ధరాత్రి సమయంలో ఇంటికి చేరుకున్నాడు. ఎంత సేపటికి భార్య తలుపు తీయకపోవడంతో సోదరుని సాయంతో తలుపు పగులకొట్టి లోపలికి వెళ్లాడు.  ఫ్యాన్ కి వేలాడుతున్నా భార్య చూసి షాకి గురయ్యాడు. భార్య మృతి చెందినట్లు గుర్తించి స్థానికుల సాయంతో పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మరి.. క్షణికావేశంలో ఇలా నిండు ప్రాణాలు తీసుకుంటున్నా వారిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet girişgrandpashabetjojobet giriş