iDreamPost
android-app
ios-app

గర్భవతిని చేసి మోసం..అదిరే ట్విస్ట్ ఇచ్చిన ప్రియురాలు!

గర్భవతిని చేసి మోసం..అదిరే ట్విస్ట్ ఇచ్చిన ప్రియురాలు!

నేటి సమాజంలో ప్రేమ పేరుతో ఎన్నో మోసాలు జరుగుతున్నాయి. కొందరు కేటుగాళ్లు ప్రేమ పేరుతో అమాయకపు యువతులను తమ వలలో వేసుకుంటారు. తమ కోరికలు తీర్చుకున్న తరువాత పెళ్లి..ప్రస్తావన రాగానే ముఖం చాటేస్తుంటారు. ప్రేమ పేరుతో మోస పోయి గర్భందాల్చిన కొందరు యువతలు అవమాన భారంతో ఆత్మహత్యలు సైతం చేసుకున్నారు. మరికొందరు అయితే తమను మోసం  చేసిన వెదవలకు తగిన గుణపాఠం చెప్తున్నారు. తాజాగా ఓ యువతి కూడా.. తనను గర్భవతిని చేసి మోసం చేసిన వ్యక్తికి దిమ్మతిరిగే ట్వీస్ట్ ఇచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే…

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతమానేపల్లికి చెందిన యువతికి, కౌటాల మండలం బొందపల్లికి చెందిన సాయి అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. సాయికి ఓ చెల్లెలు ఉంది. సాయి చెల్లికి  సదరు యవతు స్నేహితురాలు. తరచూ సాయి చెల్లెలు, సదరు యువతి కలుసుకుంటుండే వారు. ఈ క్రమంలో సాయికి యువతికి మధ్య కూడా  పరిచయం ఏర్పడింది.  అది కాస్తా స్నేహంగా మారి.. చివరకు ఇద్దరి మధ్య ప్రేమకు  దారి తీసింది. ఇక ప్రేమలో మునిగి తెలుతూ ఇద్దరు రెండేళ్ల కాలాన్ని గడిపారు. ఈ తరుణంలో ఓ బలహీనమైన క్షణంలో ఇద్దరు శారీరకంగా ఒకటయ్యారు. ఆ ఫలితంగా యువతి గర్భం దాల్చింది. దీంతో కంగారు పడిపోయిన ప్రియుడు సాయి పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లల్ని కందామని చెప్పి అబార్షన్ చేయించాడు.

 ఆ తరువాత కొంతకాలానికి యువతి పెళ్లి ప్రస్తావన తీసుకురాగా.. ప్రతిసారి ముఖం చాటేసేవాడు.  చివరకు యువతి గట్టిగా నిలదీయడంతో ఎవరికి తెలియకుండా పెళ్లి  చేసుకున్నాడు. ఆ తరువాత  కొన్నాళ్లు కాపురం చేశారు. ఒక రోజు స్వగ్రామానికి వెళ్తున్నానని చెప్పి.. కొన్నాళ్లు కనిపించకుండాపోయాడు. ఇదే సమయంలో సాయికి వారి కుటుంబసభ్యులు మరో అమ్మాయితో పెళ్లి నిశ్చయం చేశారు. బుధవారం ఉదయం పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేసి.. పెళ్లి కుమారుడు సాయి మండపంలో కూర్చున్నాడు. ఈ విషయం తెలుసుకున్న సాయి ప్రియురాలు వెంటనే స్థానిక పోలీసులను ఆశ్రయించింది. తనను సాయి మోసం చేసి గర్భవతిని చేశాడని పోలీసులకు తెలిపింది. ఆమె ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు..  నిందితుడిని అరెస్ట్ చేశారు.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş