iDreamPost
android-app
ios-app

మంచి ప్యాకేజీతో సీఏ జాబ్.. కానీ, ఆ ఒక్క కారణంతో..

  • Published Sep 19, 2024 | 6:16 PM Updated Updated Sep 19, 2024 | 6:16 PM

ఓ యువతి కష్టపడి చార్టర్ట్ అకౌంటెంట్ జాబ్ ను సంపాదించింది. అయితే చెప్పుకోదగ్గ జీతం, మంచి ఉద్యోగం కానీ,ఆ ఒక్క కారణంతో ఆ యువతి తల్లిదండ్రులకు కూడా చెప్పకుండా దారుణమైన నిర్ణయం తీసుకుంది. ఇంతకీ ఏం జరిగిందంటే..

ఓ యువతి కష్టపడి చార్టర్ట్ అకౌంటెంట్ జాబ్ ను సంపాదించింది. అయితే చెప్పుకోదగ్గ జీతం, మంచి ఉద్యోగం కానీ,ఆ ఒక్క కారణంతో ఆ యువతి తల్లిదండ్రులకు కూడా చెప్పకుండా దారుణమైన నిర్ణయం తీసుకుంది. ఇంతకీ ఏం జరిగిందంటే..

  • Published Sep 19, 2024 | 6:16 PMUpdated Sep 19, 2024 | 6:16 PM
మంచి  ప్యాకేజీతో సీఏ జాబ్.. కానీ, ఆ ఒక్క కారణంతో..

ఈ రోజుల్లో చాలామంది యువతకు ఉద్యోగం రాకపోతే.. ఒకే బాధ, వస్తే ఒక బాధలా మారిపోయింది. ఎందుకంటే.. ఉద్యోగం రానంత వరకూ ఏ ఉద్యోగం లేదని, ఖాలీగా ఉన్నారంటూ చాలామంది హేళన చేస్తారు. ఒకవేళ ఎంతో కష్టపడి ఉద్యోగం సంపాదిస్తే.. చాలి చాలానీ జీతం, అధిక పని ఒత్తిడితో సతమతమవతుంటారు. కొన్ని సందర్భాల్లో.. ఈ పని ఒత్తిడి అనేది మనసికంగా మనిషిని మరీంత కృంగదీసేలా చేస్తుంది. దీంతో పని ఒత్తిడి తట్టుకోలేని చాలామంది యువత ఇటు కుటుంబకు చెప్పుకోలేక, బాధను దిగమింగుకోలేక నరకయాతన పడుతుంటారు. ఈ క్రమంలోనే.. చాలామంది ఆత్మహత్యలు కూడా పాల్పడుతున్నారు. ఈ క్రమంలోనే.. తాజాగా ఓ యువతి కూడా కష్టపడి చార్టర్ట్ అకౌంటెంట్ జాబ్ ను సంపాదించింది. అయితే చెప్పుకోదగ్గ జీతం, మంచి ఉద్యోగం కానీ,ఆ ఒక్క కారణంతో ఆ యువతి తల్లిదండ్రులకు కూడా చెప్పకుండా దారుణమైన నిర్ణయం తీసుకుంది. ఇంతకీ ఏం జరిగిందంటే..

కేరళకు చెందిన ఓ యువతి చార్టర్ట్ అకౌంటెంట్ గా మంచి ఫ్యాకెజ్ కు ఉద్యోగం చేస్తుంది. కానీ, ఆ కంపెనీలో మేనేజర్స్ పెట్టే టార్చర్ ను భరించలేక, ఇటు తల్లిదండ్రులకు చెప్పుకోలేక అర్ధంతరంగా తనువు చలించింది. అయితే యువతి ఆత్మహత్య ఘటనకు సంబంధించి తన తల్లి ఎక్స్ ఖాతాలో షేర్ చేసుకుంటూ ఈ విధంగా బాధపడింది. నా కుతూరి పేరు అన్నా సెబాస్టియన్ పెరియల్ (26) అనే యువతి.. కష్టపడి చదువుకుని సీఏ.. చార్టెర్డ్ అకౌంటెంట్ అయ్యింది. ఈ క్రమంలోనే ఉద్యోగ ప్రయత్నాల్లో భాగంగా.. పూణెలోని EY కంపెనీలో సీఏగా ఉద్యోగం సాధించింది. దీంతో కేరళ నుంచి ఫ్యామిలీతో పూణెకు షిఫ్ట్ అయిన సెబాస్టియన్.. 2024, మార్చి 19వ తేదీన ఉద్యోగంలో చేరింది. అయితే ఉద్యోగం సాధించననే ఆనందం ఆ యువతికి ఎన్నాళ్లు కూడా మిగలలేదు. పైగా  ఆ ఉద్యోగమే ఆ యువతికి శాపం అయ్యి బలి తీసుకుంది. కాగా, జూలై, 20వ తేదీ 2024లో సెబాస్టియాన్ అధిక పని ఒత్తిడి వలన ఆత్మహత్య చేసుకున్నది.

ఎందుకంటే.. యంగ్ సీఏగా ఉద్యోగంలో చేరిన అన్నా సెబాస్టియన్ కు తరుచు పని ఒత్తిడిని ఎదుర్కొనేదట. పైగా సరైన సమాయానికి తిండి, నిద్ర ఉండేది కాదట. పైగా 24 గంటలు ఆఫీసులోనే వర్క్ చేయటానికి సమయం సరిపోయేదట. అయితే సెబాస్టియన్ కు ఉద్యోగంలో చేరిన మొదటిరోజు నుంచి ఇదే పరిస్థితి ఎదుర్కొనేదని ఆ యువతి తల్లి చెప్పుకొచ్చింది. ముఖ్యంగా అర్థరాత్రులు ఫోన్ చేసి.. రేపటి వర్క్ ఇచ్చేవారని, ఆఫీసుకు వచ్చే సమయానికి పూర్తి కావాలని మేనేజర్లు చాలా సార్లు ఫోన్ చేశావరని సెబాస్టియన్ తనతో చెప్పుకొని బాధపడేదని ఆమె తల్లి అనిత అగస్టీన్ తెలిపింది. అంతేకాకుండా.. ఆ ఆఫీసులోని తనలాగే చాలామంది పని ఒత్తిడిని ఎదుర్కొనే వారని తన కుమార్తె చెప్పినట్లు ఆమె పేర్కొంది. దీంతో తన కూతురిని ఉద్యోగం మానేయాలని పలుమార్లు తాను చెప్పేదాన్ని వివరించింది.

కానీ, సెబాస్టియన్ మాత్రం.. కష్టపడి చదివి, సాధించిన ఉద్యోగం, పట్టుదలతోనే విజయం వస్తుందని తనకు తానే సర్దిచెప్పుకునేదని ఆమె తల్లి తెలిపింది. అయితే ఇలా తీవ్రమైన ఒత్తిడి, పని భారంతో మానసికంగా, ఆరోగ్యపరంగా ఇబ్బంది పడుతుందని.. ఆత్మహత్య చేసుకునేంతగా టెన్షన్  ఉందనే విషయాన్ని ఎప్పుడూ గుర్తించలేకపోయాం అంటూ తన తల్లి కన్నీరుమున్నీరుగా విలపించింది.  పైగా కంపెనీలో ఉద్యోగి చనిపోతే కనీసం చూడటానికి ఆఫీసు నుంచి ఎవరూ రాలేదని, సమాచారం ఇచ్చినా అంత్యక్రియలకు కూడా హాజరుకాలేదని ఆ తల్లి వివరించింది. ముఖ్యంగా విలువలు, మానవత్వం అంటూ చెప్పుకొచ్చే కార్పొరేట్ సంస్థలు.. అందులో పని చేసే ఉద్యోగులు ఎలాంటి ఆలోచనలు, పరిస్థితుల్లో ఉన్నారు.. ఎలా వ్యవహరిస్తారు అనటానికి ఇదో ఉదాహరణగా చెప్పొచ్చు అంటూ ఆ తల్లి తన ఆవేదన వ్యక్తం చేసింది.

ఇదిలా ఉంటే.. కంపెనీలో పని ఒత్తిడిని తట్టుకోలేక చనిపోయిన సెబాస్టిన్ మరణంపై ఆ తల్లి చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. దీంతో ఆ పోస్ట్ పై తాజాగా కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ ఫిర్యాదును స్వీకరించి, మరణానికి దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు చేయనుంది. కార్మిక మంత్రిత్వ శాఖ అధికారికంగా ఫిర్యాదును స్వీకరించిందని దర్యాప్తు జరుగుతోందని కేంద్ర వ్యవసాయం, రైతుల సంక్షేమ శాఖ సహాయ మంత్రి శోభా కరందాజే ఎక్స్ వేదికగా తెలిపారు. ఆ సందర్భంగా తల్లి అగస్టీన్ కు జరిగిన నష్టంపై తీవ్ర విచారం వ్యక్తి చేశారు. రక్షణలేని దోపిడీ పని పరిస్థితుల ఆరోపణలపై సమగ్ర దర్యాప్తుతో న్యాయం జరిగేందుకు కృషి చేస్తామని ట్వీట్ చేశారు. మరి, పని ఒత్తిడిని తట్టుకోలేక ఓ సీఏ ఉద్యోగి ఇలా ఆత్మహత్య చేసుకున్న ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.