నాలోని చిరంజీవి ఫ్యాన్ మళ్ళీ మేల్కొన్నాడు.
I STARTED LOVING YOU AGAIN..
చాలామంది ఆలోచనలు తప్పు అని నిరూపించిన ఓ కిస్ & హగ్.
నిజంగా ఈ కొత్త సంవత్సరం ఇవి రెండూ అద్భుత దృశ్యాలు నాకు .
రెండూ చాలా టచింగ్ గా అనిపించాయ్ .
మొదటిదేమో … కలిసిమెలిసి ఉన్న ఇద్దరు అన్నదమ్ములు కుటుంబం లో వచ్చిన చిన్న మనస్పర్థల వల్ల వచ్చిన గ్యాప్ తర్వాత కలసిన ఆత్మీయ కలయికలా ఉంది.
ఎందుకో తెలీదు.. మోహన్ బాబు గారు మాట్లాడుతుంటే ఆయనని చిరంజీవి గారు అలా హగ్ చేసుకుని ముద్దు పెట్టినప్పుడు ఆ రెండు క్షణాలు నా కళ్ళు చెమ్మగిల్లాయి…
నిజంగా ఇదొక మంచి పరిణామం.
స్టేజి మీద మీరిద్దరు చనువుగా ఆత్మీయంగా గడిపిన ఆ నాలుగు క్షణాలతో మీకు తెలీకుండానే సినిమా ఇండస్ట్రీకి మీరు చాలా గొప్ప సంకేతాలని పంపించారు సర్.
అనుభవం అంటే ఇదీ…
హాట్సాఫ్ చిరంజీవి గారూ & మోహన్ బాబు గారూ…
___________
ఇక రెండోదాంట్లో … .ఆల్ మోస్ట్ దూరమయిపోయిన బంధం, ఇక మళ్ళీ కలుస్తుందా అనుకున్న బంధం ఆత్మీయంగా కలిసిన తీరు అద్భుతం.
యే కమర్షియల్ బ్లాక్ బస్టర్ లవ్ స్టోరీ కి తీసిపోని క్లైమాక్స్ లాగ ఉంది.
ఆనందం తో ప్రేక్షకుల కళ్ళు చెమ్మగిల్లేలా చేసింది.
ఆ ఆత్మీయకలయిక కి అవకాశం కల్పించిన మహేష్ బాబు ఎంత గొప్పో ఆ కలయికకి తనకుతానుగా చనువు తీసుకున్న చిరంజీవిగారు కూడా అంతే గొప్ప.
తన ఇమేజ్ ని పక్కన పెట్టి ఒక స్టెప్ తగ్గి తనని తాను తక్కువ చేసుకుని మరీ విజయశాంతి గారికి ఇచ్చిన విలువ అమోఘం.
ఈగోలు రాజ్యమేలుతున్న ఈరోజుల్లో అంత పబ్లిక్ గా అలా మాట్లాడటం మీయొక్క గొప్పతనం.
పై రెండు సంఘటనలూ మర్చిపోలేని మధురానుభూతులు.
కొత్త సంవత్సరం లో సినిమా ఇండస్ట్రీకి మీరందించిన అతి గొప్ప సంకేతాలు.
చాలామంది ఆలోచనలు తప్పు అని నిరూపించిన ఓ కిస్ & హగ్
ఈ రెండు సంఘటనలు “చిన్నప్పుడు నేనూ చిరంజీవి ఫ్యాన్ నే” అనే విషయాన్ని మళ్ళీ గుర్తు చేశాయ్.
నాలోని చిరంజీవి ఫ్యాన్ ని మళ్ళీ మేల్కొనేలా చేశాయ్.
Again I started loving you chiranjeevi gaaru. – TNR