iDreamPost
android-app
ios-app

TNR advance comment on “KRACK”

TNR advance comment on “KRACK”

రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ సినిమాలతో బోర్ కొట్టి కంటెంట్ సినిమాల వైపు దృష్టి మరల్చారు ప్రేక్షకులు.
ఏ భాషనీ వదలిపెట్టకుండా ఆ సినిమాలన్నింటినీ బాగానే ఎంజాయ్ చేశారు ఈ కరోనా టైం లో..
ఈ OTT పుణ్యమా అని రియలిస్టిక్ సినిమాలంటూ,క్లాసిక్ సినిమాలంటూ,హాఫ్ బీట్ సినిమాలంటూ,ఆర్ట్ సినిమాలంటూ,కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలంటూ అన్నీ చూసేస్తున్నాం..
ఆ కొత్తదనాన్ని ఆస్వాదిస్తున్నాం..
కానీ…అవి కూడా బోర్ కొట్టేశాయ్ బాస్..
కేవలం అవే చూసేస్తూ మొహం మొత్తేసింది..
మాంచి కమర్షియల్ సినిమా కోసం మొహం వాచిపోయి ఉన్నాం..
ఎప్పుడెప్పుడు ఒక రెగ్యులర్ కమర్షియల్ మసాలా సినిమా చూస్తామా అన్న ఆదుర్దాలో ఉన్నప్పుడు ఈ “KRACK” సినిమా రిలీజ్ అవుతోంది.
ట్రెయిలర్ చూస్తే మన మనసుకి కావాల్సిన పూర్తి మసాలాని అందించేటట్టే అనిపించింది..
కరోనా తర్వాత థియేటర్స్ కి ఇదే బెస్ట్ క్రౌడ్ పుల్లింగ్ సినిమా అవుతుంది అని గట్టిగా అనిపించింది..
చూడాలి మరి…
రోజూ ఆవకాయతో అన్నం తినేవాడికి ఎపుడైనా మజ్జిగన్నం దొరికినా అది ప్రసాదంలానే ఉంటుంది,రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు చూస్తున్న వాడికి OTT లో కంటెంట్ సినిమా కనపడ్డట్టు .
మరి…రోజూ ప్రసాదమే తింటూ మొహం మొత్తేస్తున్న వాడికి అదృష్టవశాత్తూ ఆవకాయ గిన్నే కనపడితే….?
ప్రసాదం ప్రసాదమే అయినప్పటికీ …ఆవకాయ రుచి ఆవకాయదే..
ప్రేక్షకులకి “KRACK” సినిమా అలాంటి ఓ ఆవకాయ జాడీనే అవుతుందని ఆశిస్తూ…
వాచిపోయి ఉన్న ప్రేక్షకుల మొహాన్ని మామూలూ స్థితికి తీసుకురాగలిగే ఓ అస్త్రం అవుతుందని బలంగా నమ్ముతూ…
ఆల్ ద బెస్ట్ టు “KRACK” టీం – TNR
————————————
( NOTE : కొన్ని కారణాల వలన ఈరోజు విడుదల అవ్వాల్సిన ఈ సినిమా విడుదల అవలేదు…
ఎప్పుడు రిలీజ్ అయినా ఆశించిన విజయాన్ని సాధిస్తుందని ఆశిద్దాం..)